మల్కాజిగిరి, ఏప్రిల్ 7 : మల్కాజిగిరిలోని అనుకృష్ణ దవాఖానను సోమవారం జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డా.సి ఉమాగౌరి సీజ్ చేశారు. నూతన సర్టిఫికెట్ పొందకుండానే పాత సర్టిఫికెట్ ఆధారంగా సేవలు కొనసాగిస్తున్నారని, తరీఫ్ జాబితా ప్రదర్శించకపోవడం, ప్రజలకు అవసరమైన ధరల జాబితాను బహిరంగంగా ప్రదర్శించకపోవడం ద్వారా పారదర్శకతకు భంగం కలిగించే విధంగా కొనసాగిస్తున్నందుకు హాస్పిటల్ సీజ్ చేయడం జరిగిందని చెప్పారు.
జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డా.సి ఉమా గౌరి, రెవెన్యూ అధికారులు, పోలీసు అధికారుల సమక్షంలో హాస్పిటల్లో జరుగుతున్న ఉల్లంఘనల ఆధారంగా జిల్లా కలెక్టర్, జిల్లా మెజిస్టేట్ ఆదేశాల మేరకు తక్షణ చర్యలు తీసుకుని దవాఖానకు రూ.5 లక్షల జరిమాన విధించి 60 రోజులు తాత్కాలికంగా రద్దు చేస్తూ యాజమాన్యంపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకున్నట్లు చెప్పారు.