సిటీబ్యూరో, జూన్ 23 (నమస్తే తెలంగాణ): నగరంలోని పలు విద్యాసంస్థల్లో హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ హెచ్‌న్యూ సోమవారం యాంటీడ్రగ్ అవేర్నెస్ ప్రోగ్రామ్ నిర్వహించింది. టాస్క్‌ఫోర్స్, హెచ్‌న్యూ డిప్యూటీ కమిషనర్ వైవీఎస్ సుధీంద్ర ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో డ్రగ్స్ వినియోగం వల్ల జరిగే అనర్థాలు, డ్రగ్స్ లేకుండా హాయిగా ఎలా జీవనం గడపాలో తెలిపారు. సంతోష్‌నగర్‌లోని వేద డిగ్రీకాలేజిలో జరిగిన అవగాహన సదస్సులో హాజరైన విద్యార్థులను ఉద్దేశించి సుధీంద్ర మా ట్లాడుతూ..
విద్యార్థుల జీవితాల్లో డ్రగ్స్ ఎలా ప్రభావితం చేస్తాయో చెప్పి వాటికి దూరంగా ఉండాలని, విద్యాసంస్థల్లోకి అటువంటి ప్రభా వం పడకుండా చూడాలన్నారు. డ్రగ్స్ వల్ల విద్యార్థుల బంగారు భవిష్యత్ దెబ్బతింటుందని, కేసులతో ఇబ్బందులు పడడమే కాకుండా ఆరోగ్యం కూడా దెబ్బతింటుందని, సమాజంలో మనకున్న సంబంధాలు మొత్తం కట్ అయిపోతాయని చెప్పారు. విద్యార్థులు డ్రగ్స్‌కు దూరంగా ఉండడంతోపాటు అవి వాడే వారి విషయంలో జాగ్రత్తగా ఉండాలని సుధీంద్ర సూచించారు.
న్యూ ఎరా ఇంటర్నేషనల్ స్కూల్లో జరిగిన హెచ్‌న్యూ ఇన్స్పెక్టర్ జీఎస్ డానియల్ విద్యార్థులకు యాంటీ డ్రగ్స్‌పై అవగాహన కల్పించగా, అల్కాపురిలోని హోలీమేరీ కాలేజి ఆఫ్ నర్సింగ్‌లో హెచ్‌న్యూ ఇన్స్పెక్టర్ బి.బాలస్వామి.. విద్యార్థులను డ్రగ్స్ ఎలా ఆకర్షిస్తున్నదో వివరించి వాటిని అలవాటు చేసుకుంటే ఎలాంటి దుష్పరిణామాలు ఉంటాయో వివరించారు. హెచ్‌న్యూ యాంటీడ్రగ్ అవేర్నెస్ ప్రోగ్రామ్‌కు విద్యాసంస్థల యాజమాన్యాలు సహకరించి విద్యార్థుల్లో అవగాహన కల్పించడాన్ని అభినందించారు. పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఉన్న విద్యాసంస్థల్లో రెగ్యులర్‌గా ఇటువంటి అవగాహన కార్యక్రమాలు చేపడుతామని డీసీపీ సుధీంద్ర తెలిపారు.