హైదరాబాద్ : రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను బుధవారం అనిల్ కూర్మాచలం మర్యాద పూర్వకంగా కలిశారు. ఇటీవలే నూతనంగా తెలంగాణ ఫిల్మ్, టీవీ, థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా అనిల్ కుమార్ నియామకమయ్యారు. మంత్రి తలసాని అనిల్‌ను శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు అందజేశారు. భవిష్యత్‌లో మరిన్ని ఉన్నత పదవులు చేపట్టాలని మంత్రి ఆకాంక్షించారు.