Anganwadi | జూబ్లీహిల్స్, ఏప్రిల్ 21: హైదరాబాద్ రహమత్ నగర్ డివిజన్ బ్రహ్మశంకర్ నగర్ అంగన్వాడీ కేంద్రంలో గర్భవతులకు సీమంతం కార్యక్రమం కన్నుల పండువగా నిర్వహించారు. రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో గర్భిణులకు పసుపు, కుంకుమ, స్వీట్లు, పూలు, పండ్లు, చీర, గాజులతో సాంప్రదాయబద్ధంగా వేడుకలు నిర్వహించారు.
ఉపాధి, ఉద్యోగ పనుల నిమిత్తం నగరంలో స్థిరపడిన మహిళలకు, వారి పిల్లలకు అంగన్వాడీ కేంద్రాలు అండగా ఉంటున్న విషయం తెలిసిందే. గర్భవతులకు సీమంతం ద్వారా పుట్టింటి వద్ద అందాల్సిన ఈ అపూర్వ గౌరవం స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చి అంగన్వాడీ కేంద్రాల్లో సాంప్రదాయబద్దంగా నిర్వహిస్తున్నారు. రహమత్ నగర్లోని అన్ని అంగన్వాడీ కేంద్రాల్లోని గర్భవతులకు సీమంతం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ ప్రతినిధులు, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు.