అబిడ్స్ జూలై 11 :బోనాల పండుగ సందర్భంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు త్వరితగతిన పూర్తి చేయాలని బీఆర్ఎస్ నేత నేత ఎం ఆనంద్ కుమార్ గౌడ్ అధికారులను కోరారు. శుక్రవారం ఆయన జిహెచ్ఎంసి, వాటర్ వర్క్స్ అధికారులతో కలిసి జాంబాగ్, గన్ ఫౌండ్రీ డివిజన్ల పరిధిలోని పలు బస్తీల్లో పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా ఆనంద్ కుమార్ గౌడ్ బస్తీల్లో నెలకొన్న సమస్యలను అధికారులకు వివరించి వెంటనే పనులు ప్రారంభించాలని కోరారు.
బోనాల పండుగ సమీపించిన నేపథ్యంలో గోషామహల్ నియోజకవర్గంలోని ఆలయాల వద్ద పరిసర ప్రాంతాల్లో కచ్చా మోరీల పూడికతీత, దెబ్బతిన్న రోడ్లకు ప్యాచ్ వర్క్ పనులు, పొల్యూషన్ వాటర్ సప్లై తదితర సమస్యలను వెంటనే పరిష్కరించేలా అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు భజరంగ్ సింగ్, నరేష్ గౌడ్, సాయి శేఖర్, ఉమ, తదితరులు పాల్గొన్నారు.