సిటీబ్యూరో, ఆగస్టు 07 (నమస్తే తెలంగాణ ) : కల్తీ ఆహార పదార్థాల నియంత్రణకు నిరంతరం తనిఖీలు చేసేలా ఫుడ్‌సేఫ్టీ అధికారులకు ప్రతి వారం టార్గెట్స్ ఇవ్వాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి కాట(Amrapali) హెల్త్ అడిషనల్ కమిసనర్ను ఆదేశించారు. బుధవారం అడిషనల్ కమిషనర్లు, జోనల్ కమిషనర్లతో కమిషనర్ ఆమ్రపాలి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. హోటల్, రెస్టారెంట్లు, స్ట్రీట్ వెండర్స్ విక్రయించే తినుబండారాలలో(Food items) కల్తీ లేకుండా ఫుడ్‌సేఫ్టీ అధికారులు ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించేలా చర్యలు చేపట్టాలని తెలిపారు.
జూనియర్ అసిస్టెంట్ నుంచి సూపరింటెండెంట్ వరకు అంతర్గతంగా బదిలీలకు కమిటీ వేసినందున, కమిటీ నిర్ణయం మేరకు నియమ, నిబంధనలు అనుసరించి బదిలీల ప్రక్రియను కొనసాగించాలని సూచించారు. సీఆర్ఎంపీ ద్వారా లైనింగ్ , జీబ్రా క్రాసింగ్ లైన్ మార్కింగ్‌తో పాటు ఫుట్‌పాత్ లాంటివి ఏమైనా గ్యాప్‌లు ఉన్న నేపథ్యంలోను ఈ నెలాఖరు వరకు పూర్తి చేయించాలని జోనల్ కమిషనర్లను కమిషనర్ ఆమ్రపాలి ఆదేశించారు.