భారీ వర్షానికి అమీన్ఫూర్ ప్రాంతం అతలాకుతలం అయ్యింది. మంగళవారం సాయంత్రం కురిసిన వర్షానికి బీరంగూడ, అమీన్పూర్ డివిజన్ల పరిధిలోని పలు రహదారులు జలమయమయ్యాయి. వీధుల్లో నడుములోతు వరదనీరు చేరడంతో పాటు సెల్లార్లలోకి వరద చేరడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. వాహనాలు నీట మునిగాయి. బల్దియా సిబ్బంది అతికష్టం మీద సెల్లార్లలోని నీటిని మోటార్ల ద్వారా బయటకు పంపారు. విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
– అమీన్పూర్ (జిన్నారం), జూన్ 23
