ట్రాఫిక్‌లో చిక్కిన అంబులెన్స్ పోయిన ప్రాణం
అంబులెన్స్ వెళ్లేందుకు దారి లేకపోవడంతో అనారోగ్యానికి గురైన ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. బోయిన్పల్లి మార్కెట్ సమీపంలోని అంబేద్కర్‌నగర్‌లో నివాసం ఉండే పోచయ్య గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతుండటంతో కుటుంబసభ్యులు మంగళవారం రాత్రి అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు.
- బోయిన్పల్లి మార్కెట్ సమీపంలో ఘటన
- రోడ్డుపై బైఠాయించి స్థానికుల ధర్నా
అంబులెన్స్ వెళ్లేందుకు దారి లేకపోవడంతో అనారోగ్యానికి గురైన ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. బోయిన్పల్లి మార్కెట్ సమీపంలోని అంబేద్కర్‌నగర్‌లో నివాసం ఉండే పోచయ్య గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతుండటంతో కుటుంబసభ్యులు మంగళవారం రాత్రి అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో మార్కెట్ యార్డు చౌరస్తాలో ట్రాఫిక్ సమస్యతో గంట పాటు అంబులెన్స్ ట్రాఫిక్‌లో చిక్కుకుంది. దీంతో అంబులెన్స్‌లోనే పోచయ్య ప్రాణాలు పోయాయి. విషయం తెలుసుకున్న బస్తీవాసులు ఒక్కసారిగా రోడ్డుపై బైఠాయించి ధర్నాకు దిగారు.
బోయిన్పల్లి సీఐ తిరుపతి రాజు నచ్చచెప్పడంతో బస్తీవాసులు ధర్నాను విరమించారు. కాగా, ఎమ్మెల్యే శ్రీగణేశ్ ట్రాఫిక్ ఏసీపీ శంకర్రాజు, బోయిన్పల్లి సీఐ తిరుపతిరాజు మార్కెట్‌యార్డు రోడ్డును పరిశీలించారు. కూరగాయల రిటైల్ దుకాణాలు క్రమ పద్ధతిలో ఏర్పాటు చేసుకోవాలని దుకాణాదారులకు ఎమ్మెల్యే సూచించారు. అత్యవసర సేవలకు ఆటంకం కలుగకుండా చర్యలు తీసుకోవాలని ఏసీపీ శంకర్రాజను ఆదేశించారు. – కంటోన్మెంట్
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

