Amberpet | గోల్నాక, మార్చి 8: పేదలకు అపత్కాలంలో సీఎం రిలీఫ్ ఫండ్ ఓ వరమని అంబర్ పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ తెలిపారు. శనివారం గోల్నాక క్యాంపు కార్యాయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అనారోగ్యంతో బాధపడుతూ వివిధ దవాఖానల్లో చికిత్స పొందిన 25 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజురైన రూ.8లక్షల 49 వేల విలువగల చెక్కులను ఆయన పంపిణీ చేశారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. వేలాది మంది పేద, మధ్య తరగతి ప్రజలకు ఏటా సీఎం సహాయ నిధి ద్వారా ఆర్థిక చేయూతనందించడం జరుగుతుందని తెలిపారు. నియోజకవర్గంలో వందలాది మంది పేదలకు వైద్య సేవల కోసం సీఎం సహాయనిధి ద్వారా చెక్కులు అందించినట్లు ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ చెప్పారు.