BRAOU | బంజారాహిల్స్, అక్టోబర్ 24: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటికీ సంబంధించిన 10 ఎకరాల స్థలాన్ని జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీకి కేటాయించాలనే రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనను వ్యతిరేకిస్తూ ఉద్యోగుల ఆందోళన ముమ్మరంగా కొనసాగుతోంది. గురువారం మధ్యాహ్నం యూనివర్సిటీకి చెందిన అధ్యాపక, అధ్యాపకేతర, టెక్నికల్, అడ్మినిస్ట్రేటివ్, టైం స్కేల్, కాంట్రాక్టు ఉద్యోగులంతా మధ్యాహ్న భోజన విరామ సమయంలో నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రభుత్వం నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని నినాదాలు చేశారు. కార్యక్రమంలో ఉద్యోగుల జేఏసీ చైర్ పర్సన్ ప్రొ. పల్లవి కాబ్డే, కన్వీనర్ ప్రొ.వడ్డాణం శ్రీనివాస్, సెక్రటరీ జి.మహేశ్వర్ గౌడ్, జేఏసీ నేతలు డా.యాకేశ్ దైద, కే.ప్రేమ్ కుమార్, రవీంద్రనాథ్ సోలమన్, డా. ఎల్కేవీ రెడ్డి, హబీబుద్దీన్, రజినీకాంత్, నారాయణరావు పాల్గొన్నారు.