సిటీబ్యూరో, మార్చి 28 (నమస్తే తెలంగాణ): ఫుడ్ సేఫ్టీ విభాగం అధికారులు శుక్రవారం పలు చోట్ల తనిఖీలు నిర్వహించారు. అల్వాల్‌లోని కింగ్స్ 7 బేకరీ, మాదాపూర్ పాలమూరు గ్రిల్, జవహర్ నగర్ తిరుమల మెస్ అండ్ కర్రీ పాయింట్, ఆర్టీసీ క్రాస్‌రోడ్‌లోని బావర్చీ రెస్టారెంట్, గచ్చిబౌలిలోని సిప్ అండ్ స్నాక్స్ తనిఖీలు చేశారు.
నిబంధనలు ఉల్లంఘించిన వ్యాపారస్తులకు నోటీసులు జారీ చేశారు. అలాగే మల్లాపూర్‌లో అమన్ స్వీట్ ఫ్యాక్టరీలో గడువు ముగిసిన స్వీట్లతో మళ్లీ తయారు చేస్తున్నట్లు గుర్తించారు. సంబంధిత ఫ్యాక్టరీని సీజ్ చేశారు.