చదువుతో పాటు క్రీడల్లో రాణించాలి
క్రీడలు విద్యార్థుల్లో పోటీతత్వాన్ని పెంపొందిస్తాయని కొండా లక్ష్మణ్ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం ఉపకులపతి డా. నీరజా ప్రభాకర్ అన్నారు. గురువారం రంగారెడ్డి జిల్లా , రాజేంద్రనగర్‌లోని ఉద్యాన కళాశాల ఆవరణలో అంతర కళాశాల స్థాయి క్రీడలను ప్రారంభించారు.
- అంతర కళాశాల స్థాయి క్రీడాపోటీలు ప్రారంభం
- వీసీ నీరజా ప్రభాకర్
వ్యవసాయ యూనివర్సిటీ, డిసెంబర్ 8 : క్రీడలు విద్యార్థుల్లో పోటీతత్వాన్ని పెంపొందిస్తాయని కొండా లక్ష్మణ్ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం ఉపకులపతి డా. నీరజా ప్రభాకర్ అన్నారు. గురువారం రంగారెడ్డి జిల్లా , రాజేంద్రనగర్‌లోని ఉద్యాన కళాశాల ఆవరణలో అంతర కళాశాల స్థాయి క్రీడలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థులు విద్యతో పాటు, క్రీడల్లో రాణించాలన్నారు.
క్రీడల్లో పాల్గొనడం ద్వారా విద్యార్థుల మానసిక, శారీరక శక్తి పెరగడంతో పాటు, సమగ్రత టీమ్ స్పిరిట్ , సాంఘిక బాధ్యతను తీసుకోవడం.. నాయకత్వ లక్షణాలు మెరుగు పడుతాయన్నారు. యోగా, మెడిటేషన్, క్రీడలు బో ధనలో తప్పని సరి కావాలని, 2023 జనవరి మూడో వారంలో అఖిల భారత వ్యవసాయ, అనుబంధ విశ్వవిద్యాలయాల మధ్య సాంస్కృతిక పోటీలు కర్ణాటకలోని యూనివర్సిటీ ఆఫ్అగ్రి కల్చర్ సైన్సెస్‌లో నిర్వహించనున్నట్లు తెలిపారు.
హర్యానాలోని చౌదరీచరణ్సింగ్ హర్యానా అగ్రికల్చర్ వర్సిటీలో క్రీడలు జరగనున్నాయని తెలిపారు. రాజేంద్రనగర్, మోజర్ల ఉద్యాన కళాశాల నుంచి 57 మంది విద్యార్థులు, 67 మంది విద్యార్థినులు , 38 క్రీడల్లో పాల్గొననున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో వర్సిటీ హార్టికల్చర్ డీన్ కిరణ్‌కుమార్, రాజేంద్రనగర్ కళాశాల అసోసియేట్ డీన్ ప్రశాంత్, డీన్ లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
PM Modi | ప్రభుత్వం మారినా రాష్ట్ర అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తాం.. తమిళనాడులో ప్రధాని మోదీ
Iran Warning | యెమెన్ విషయంలో జోక్యం వద్దు.. పాకిస్థాన్‌కు ఇరాన్ వార్నింగ్..!
Farmers Protest | కరెంట్ కోతలను నిరసిస్తూ సబ్‌స్టేషన్ వద్ద రైతుల వంటవార్పు
truck rams Durga idol procession | దుర్గా విగ్రహం ఊరేగింపుపైకి దూసుకెళ్లిన లారీ.. ముగ్గురు మృతి, పది మందికి గాయాలు
CJP Leaders | పౌరులపై మోదీ ప్రభుత్వం యుద్ధం చేస్తోంది.. ఇది బహిరంగ ఎమర్జెన్సీ.. సీజేపీ నేతల ఆరోపణ
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

