TDCA | హైదరాబాద్, ఆట ప్రతినిధి: తెలంగాణ డిస్ట్రిక్స్ అసోసియేషన్ (టీడీసీఏ)కు బీసీసీఐ గుర్తింపు కోసం సహకరించాలని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిని అల్లీపురం వెంకటేశ్వర్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) కేవలం హైదరాబాద్‌కు మాత్రమే పరిమితమైందని, మిగతా జిల్లాల ప్లేయర్లకు ప్రాతినిధ్యం లేకుండా పోయిందని ఈ సందర్భంగా వెంకటేశ్వర్‌రెడ్డి అన్నారు.
ఆదివారం కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలుసుకుని పలు అంశాలను ఆయన దృష్టికి తీసుకొచ్చారు. తెలంగాణ గ్రామీణ యువతకు గత కొన్నేండ్ల నుంచి తీరని అన్యాయం జరుగుతున్నదని, ఈ విషయంలో కలుగజేసుకొని టీడీసీఏకు గుర్తింపునిచ్చేందుకు సహాయపడాలని కోరారు. తెలంగాణ జిల్లాల్లో ప్రతిభ కలిగిన క్రికెటర్లకు కొదువలేదని, వెన్నుతట్టి ప్రోత్సహిస్తే జాతీయ జట్టు, ఐపీఎల్లో మెరుపులు మెరిపించేందుకు సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు. హెచ్‌సీఏలో పూర్తిగా అవకతవకలు జరుగుతున్నాయని, ప్లేయర్ల ఎంపిక విషయంలో ప్రతిభకు కాకుండా పరపతికి పెద్దపీట వేస్తున్నారని అన్నారు.