Prakash Goud | మణికొండ, ఏప్రిల్ 30 : అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ అన్నారు. నార్సింగి మున్సిపాలిటీ పరిధిలోని ఖానాపూర్‌లో రూ.2.93 కోట్ల వ్యయంతో నిర్మించిన నూతన కమ్యూనిటీ హాల్‌ను ఆయన ప్రారంభించారు. అనంతరం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ మాట్లాడుతూ.. అన్ని వర్గాల సంక్షేమ లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు.
మున్సిపాలిటీ సాధారణ నిధులతో రూ.2.92 లక్షలతో ఖానాపురం గ్రామానికి చెందిన అన్ని వర్గాల ప్రజల అవసరార్థం కమ్యూనిటీ హాల్ నిర్మించి అందుబాటులోకి తీసుకువచ్చామని ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ తెలిపారు. గతంలోనూ ఖానాపురం గ్రామంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టామని ఎమ్మెల్యే ఈ సందర్భంగా గుర్తు చేశారు.