
జవహర్‌నగర్, జనవరి 7: అర్హులైన ప్రతి ఒక్కరూ కరోనా వ్యాప్తి చెందకుండా వ్యాక్సిన్ వేయించుకోవాలని వైద్య సిబ్బంది సూచించారు. శుక్రవారం కార్పొరేషన్‌లోని మ్యాగి హై స్కూల్ విద్యార్థులకు కరోనా టీకాలు వేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, వైద్యసిబ్బంది పాల్గొన్నారు.
ప్రతి ఒక్కరూ మాస్కు ధరించాలని 26వ మద్రాస్ బెటాలియన్ సైనికులు తెలిపారు. కార్పొరేషన్‌లోని 11వ డివిజన్ కార్పొటర్ గుండ్రాతి లక్ష్మీకృష్ణగౌడ్ ఆధ్వర్యంలో చిన్నారులకు మాస్కులు, శానిటైజర్ పంపిణీ చేశారు. ఈ అంగన్వాడీ టీచర్ శాంతకుమారి, సిబ్బంది పాల్గొన్నారు.
దమ్మాయిగూడలో..
మేడ్చల్ కలెక్టరేట్ : 15 ఎండ్లు పై బడిన వారు తప్పని సరిగా వ్యాక్సిన్ తీసుకోవాలని దమ్మాయిగూడ మున్సిపల్ చైర్మన్ ప్రణీత శ్రీకాంత్ గౌడ్ తెలిపారు. మున్సిపల్ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలో 335 మంది విద్యార్థులకు కరోనా వ్యాక్సిన్ వేశారు. గురువారం చైర్మన్ వ్యాక్సిన్ కేంద్రాన్ని పరిశీలించారు. వైస్ చైర్మన్ నరేందర్ రెడ్డి, కమిషనర్ స్వామి, కౌన్సిలర్లు రమేశ్ గౌడ్, శ్రీహరి గౌడ్, ఉపాధ్యాయులు, ఏఎన్ఎంలు పాల్గొన్నారు.
సీఎంఆర్‌లో వ్యాక్సినేషన్..
మేడ్చల్ రూరల్ : గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ కండ్లకోయ పరిధిలోని సీఎంఆర్ టెక్నికల్ క్యాంపస్‌లో శుక్రవారం వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని సీఎంఆర్ చైర్మన్ గోపాల్‌రెడ్డి ప్రారంభించి మాట్లాడారు. శిబిరంలో 400ల మందికి వ్యాక్సిన్ వేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆస్పత్రి డీన్ శ్రీనివాస్ ఆచార్య, ప్రిన్సిపాల్ రాజిరెడ్డి, సీఎంఆర్ సీఈవో అభినవరెడ్డి, కార్యదర్శి వసంతలత, డీన్ అలీ బేక్, ఎన్ఎస్ఎస్పీవో దుర్గాప్రసాద్‌రెడ్డి, పీహెచ్సీ వైద్యులు శైలజ, సాహెబ్, పాల్గొన్నారు.