హైదరాబాద్ : కూకట్పల్లి హౌసింగ్ బోర్డు కాలనీలోని రోడ్డు నంబర్ 3లో మద్యం మత్తులో యువకులు వీరంగం సృష్టించారు. మద్యం మత్తులో కారును అతి వేగంగా నడుపుతూ స్థానికులను భయభ్రాంతులకు గురి చేశారు. స్థానికంగా ఉన్న హాస్టల్ అమ్మాయిల పట్ల యువకులు అసభ్యకరంగా ప్రవర్తించారు.
దీంతో కొంత మంది స్థానికులు.. ఆ యువకుల కారును ఆపి దేహాశుద్ధి చేశారు. అక్కడ్నుంచి యువకులు తప్పించుకున్నారు. పోలీసులు రోడ్ నంబర్ 3కి చేరుకుని కారును స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు యువకుల ఆచూకీ కోసం గాలిస్తున్నారు. కారు నంబర్ – టీఎస్ 09 ఎఫ్ఎల్ 2041.