Aishwarya | అమ్మాయి చనిపోవడానికి కారణం డాక్టర్లు.. మెడికవర్ ఆసుపత్రిలో ఐశ్వర్య మృతిపై మేనమామ
Aishwarya | కిడ్నీ స్టోన్ సమస్యతో చూపించుకునేందకు ఆస్పత్రికి నడుచుకుంటూ వచ్చిన అమ్మాయి ఐశ్వర్యను మెడికవర్ ఆసుపత్రి డాక్టర్లు చంపేశారని ఆమె కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Aishwarya | మెడికవర్ ఆసుపత్రిలో వరుస మరణాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. ఐశ్వర్య(26) అనే యువతిని కిడ్నీలో రాళ్లు ఉన్నాయని ఆసుపత్రిలో చేరిన 10 రోజులకే మృతి బ్రెయిన్ డెడ్ చెప్పడం పలు అనుమానాలకు తావిస్తోంది.. ఐశ్వర్య మరణించినా డబ్బులు వసూలు చేసేందుకు ఇంకా చనిపోలేదని డాక్టర్లు డ్రామా చేస్తున్నారని.. నడుస్తూ వచ్చిన అమ్మాయిని చంపేశారని ఆమె కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఐశ్వర్య మేనమామ మీడియాతో మాట్లాడుతూ.. కేవలం కిడ్నీలో స్టోన్ ఉందని ఈ నెల 6వ తారీఖు రోజు తీసుకొచ్చి ఆస్పత్రిలో అడ్మిట్ చేశాం. నెక్ట్స్ రోజు పంపించేస్తం.. ఏం ప్రాబ్లమ్ లేదని చెప్పిర్రు. డైరెక్ట్ అక్కడి నుంచి ఐసీయూకు తీసుకొని వెళ్లిపోయారు. ఏంది సార్ ఐసీయూకు తీసుకెళ్లారంటే ఆమె కొంచెం క్రిటికల్‌గా ఉంది.. మొత్తం బాడీ మొత్తం ఇన్ఫెక్షన్ వ్యాపించింది. తగ్గిపోతుంది. అది ఇస్తున్నాం.. ఇది ఇస్తున్నామని ఏదోదో చెప్తున్నారు. అసలు చూద్దామంటే లోపలికి రానిస్తలేరు. మీరు లోపలికి పోతే ఇన్ఫెక్షన్ అవుతదని చెప్తూనే.. వాళ్లు మాత్రం చెప్పులు వేసుకొని, బూట్లు వేసుకొని పోతున్నరు. మాకు ఇప్పటివరకు 8 లక్షల వరకు ఖర్చు అయింది. ఇంకా కట్టు కట్టు అని అంటున్నరు.. ఐశ్వర్య తండ్రి లాయరే.. ఈ పాపనేమో సికింద్రాబాద్ కోర్టులో లాయర్‌గా పని చేస్తుంది. నడుచుకుంటూ వెళ్లే అమ్మాయికి ఇలా జరిగిందంటే కారణం ఆస్పత్రి యాజమాన్యం, వైద్యులేనని ఆవేదన వ్యక్తం చేశాడు.
ఆసుపత్రిలో చేరిన రోజు ఎలాంటి సమస్యలు లేవు.. రేపు డిశ్చార్జ్ చేస్తామని చెప్పారు
మరుసటి రోజు ఐసీయూకి తీసుకెళ్లారు.. ఎందుకని అడిగితే కొంచెం క్రిటికల్‌గా ఉందన్నారు
నాతో పాటే నడుచుకుంటూ ఆసుపత్రికి వచ్చిన అమ్మాయి చనిపోయింది
ఇప్పటివరకు రూ.7 లక్షలు కట్టాం.. ఇంకా కట్టమని అడుగుతున్నారు
ఇది ముమ్మాటికీ ఆసుపత్రి నిర్లక్ష్యమే
నా కొడుకుతో ఆమెకు పెళ్లయి నెల రోజులైంది.. ఆమె తండ్రి మల్కాజ్గిరి న్యాయమూర్తి
– మృతురాలి మామ
— Telugu Scribe (@TeluguScribe) October 13, 2026
Read Also :
Bathukamma Celebrations | దుబాయ్‌లో GTF ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా బతుకమ్మ సంబరాలు.. ఫొటోలు
Congress | కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల భూములను బలవంతంగా లాక్కుంటున్నది : సబితా ఇంద్రా రెడ్డి
Train | డిసెంబర్ 4న విజయ్ సేతుపతి ‘ట్రైన్’.. నితిన్, నాగచైతన్య సినిమాలకు గట్టి పోటీ!
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Aishwarya | అమ్మాయి చనిపోవడానికి కారణం డాక్టర్లు.. మెడికవర్ ఆసుపత్రిలో ఐశ్వర్య మృతిపై మేనమామ
రాజుపాలెం సోలార్ ప్లాంట్‌లో మరోసారి కేబుల్స్ చోరీ
కాంగ్రెస్ అసమర్థ పాలనతో రైతులకు తీవ్ర నష్టం : పువ్వాడ అజయ్ కుమార్
INDIA Bloc | ఇండియా బ్లాక్ కూటమిలో విబేధాలు.. సుప్రీంకోర్టులో పిటిషన్‌కు దూరంగా ప్రధాన పార్టీలు
ECB | ఇంగ్లండ్ స్క్వాడ్‌లో కొత్త కుర్రాళ్లు.. బెథెల్, ఆర్చర్‌కు పిలుపు..!
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

