Shamshabad Airport | ఓ వృద్ధురాలి పట్ల ఎయిర్‌లైన్స్ సిబ్బంది(Airline staff) అమర్యాద ప్రవర్తించారు. వృద్ధురాలి వద్ద వీల్‌చైర్(Elderly woman Wheelchair) లాక్కోవడంతో నడవలేక సదరు మహిళ గుండెపోటుకు గురైంది పరిస్థితి విషమంగా ఉండటంతో దవాఖానలో చేర్పించారు. వివరాల్లోకి వెళ్తే..సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ కు చెందిన సరోజ (76) అనే మహిళ గుండె, నరాలకు సంబంధించిన వ్యాధులతో బాధపడుతూ మెరుగైన వైద్యం కోసం అమెరికా వెళ్లింది.ఈ నెల 10వ తేదీన ఎతిహాద్ ఎయిర్‌లైన్స్‌లో బయలుదేరి శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న సరోజ నడిచే పరిస్థితి లేక వీల్‌చైర్ బుక్ చేసుకుంది.
అయితే ఆ వీల్‌చైర్‌ను ఎయిర్‌లైన్స్ సిబ్బంది బలవంతంగా లాక్కున్నారు. దీంతో ఆమె అతి కష్టం మీద నడుస్తూ ఎయిర్‌పోర్టు నుంచి బయటికి వచ్చి ఇంటికి చేరుకోగానే గుండెపోటుకు గురైంది. కుటుంబ సభ్యులు వెంటనే చికిత్స నిమిత్తం హాస్పిటల్‌కు తరలించగా పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఎయిర్‌లైన్స్ సంస్థ, జీహెచ్ఐఏఎల్ అధికారులపై ఆర్జీఐఏ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.