Air India | శంషాబాద్‌లో ఎయిర్ ఇండియా విమానాలు రద్దు.. ఆందోళనలో ప్రయాణికులు
శంషాబాద్ (Shamshabad) విమానాశ్రయానికి రాకపోకలు సాగించే పలు విమానాలను ఎయిర్ ఇండియా (Air India) రద్దు (Cancelled) చేసింది. దీంతో విషయం తెలియక ఎయిర్‌పోర్టుకు (Airport) వచ్చిన ప్రయాణికులు (Passingers) ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
హైదరాబాద్: నగరంలోని శంషాబాద్ (Shamshabad) విమానాశ్రయానికి రాకపోకలు సాగించే పలు విమానాలను ఎయిర్ ఇండియా (Air India) రద్దు (Cancelled) చేసింది. దీంతో విషయం తెలియక ఎయిర్‌పోర్టుకు (Airport) వచ్చిన ప్రయాణికులు (Passingers) ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. సాంకేతిక కారణాలతో హైదరాబాద్ (Hyderabad) నుంచి పలు ప్రాంతాలకు వెళ్లాల్సిన, రావాల్సి విమానాలను ఎయిర్ ఇండియా రద్దుచేస్తున్నట్లు ప్రకటించింది. అయితే ఈ సమాచారాన్ని ప్రయాణికులకు అందించకపోవడంతో.. సోమవారం తెల్లవారుజామున 40 మంది ప్రయాణికులు విమానాశ్రయానికి వచ్చారు. తాము వెళ్లాల్సిన విమానం ఎంతకూ రాకపోవడంతో సంబంధిత అధికారులను నిలదీశారు.
దీంతో హైదరాబాద్ నుంచి తిరుపతి, బెంగళూరు, విశాఖపట్నం, మైసురు వెళ్లాల్సిన విమానాలను, చెన్నై, తిరుపతి, బెంగళూరు, మైసూరు నుంచి నగరానికి రావాల్సిన విమానాలను రద్దుచేసినట్లు ప్రకటించారు. ముందుగానే తమకు సమాచారం అందించకుండా తమ సమయం వృథా చేశారంటూ సిబ్బందిపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తంచేశారు. దీంతో డబ్బులు తిరిగి ఇచ్చేస్తామని చెప్పడంతో వారు అక్కడినుంచి వెనుతిరిగారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

