సిటీబ్యూరో, ఆగస్టు 10 (నమస్తే తెలంగాణ): ఒక లెటర్ రాయాలంటే ఇబ్బంది పడాల్సిన అవసరమే లేదు. ఒక లెటర్ రాయాలని అడిగితే చాలు క్షణాల్లో రాసి పెడుతుంది. మాటలు రాసిస్తే చాలు చదివి పెడుతుంది. ఇంకా అవసరం అనుకుంటే ఏకంగా మనిషి రూపంలో కనిపించే బొమ్మగా ప్రత్యక్షంగా కనిపిస్తూ.. రాసిచ్చిన మాటలను చదివేస్తుంది. ఇలా ఒకటో రెండో పనులు కాదు రకరకాల పనులను చకచకా చేసి పెడుతుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) టెక్నాలజీ. ప్రపంచ వ్యాప్తంగా శరవేగంగా విస్తరిస్తున్న ఈ పరిజ్ఞానం 2045 నాటికి నేటి ఉద్యోగాల్లో 50 శాతం ఏఐ టెక్నాలజీయే భర్తీ చేస్తుందని ఓ అధ్యయనంలో తేలింది.
ఏఐ చూపే ప్రభావాన్ని ముందుగానే గుర్తించిన యూరోపియన్ యూనియన్ (ఈయూ) కృత్రిమ మేధ విషయంలో నియంత్రణ దిశగా పెద్ద అడుగు వేసింది. ఇలా ఒకవైపు ఏఐ టెక్నాలజీ వినియోగంపై, దాని కట్టడి చేసేందుకు ప్రయత్నాలు జరుగుతుండగానే మార్కెట్లోకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ పదుల సంఖ్యలో వచ్చేశాయి. గతేడాది నవంబర్ 30న ఆవిష్కరించిన చాట్ జీపీటీతో ప్రపంచ వ్యాప్తంగా ఏఐ పనితీరు ఏంటో అందరికీ అర్థమైపోయింది. ఇంటర్నెట్ అంటే సెర్చ్ ఇంజన్‌గా టక్కున గుర్తొచ్చే గూగుల్‌కు పోటీ అంటూ చాట్ జీపీటీ చరిత్ర సృష్టించింది. దీంతో ప్రముఖ టెక్నాలజీ కంపెనీలు సైతం ఏఐతో అవసరాలకు సరిపోయేలా సాఫ్ట్వేర్ అప్లికేషన్స్‌ను, టూల్స్ రూపొందించే పనిలో నిమగ్నమై ఉన్నాయి. చాట్ జీపీటీ దెబ్బతో గూగుల్ సైతం ఏఐ టెక్నాలజీని వినియోగిస్తూ గూగుల్ బార్డ్ పేరుతో ఒక అప్లికేషన్‌ను తీసుకువచ్చింది. చాట్‌జీపీటీ మాతృ సంస్థగా ఉన్న ఓపెన్ఏఐకి పూర్తి స్థాయి మద్దతు మైక్రోసాఫ్ట్ అందిస్తోంది. ఇప్పటికే మార్కెట్లో వందల సంఖ్యలో ఏఐ టూల్స్ ఉచితంగాను, చెల్లింపులు చేయడం ద్వారా వినియోగించుకునేందుకు వీలుగా అందుబాటులో ఉన్నాయి. కాగా, ప్రస్తుతం ఏఐని కొందరు వరంలా ఉందని భావిస్తే, మరి కొందరు శాపంగా మారుతుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో కొన్ని పనులు వేగంగా చేసుకునేందుకు ఆధునిక ఏఐ టూల్స్‌పై ఆధారపడవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
కంపెనీల వెబ్సైట్లలో ఉండే చాట్ బోట్లు సైతం ఏఐ పరిజ్ఞానంతోనే వస్తున్నాయి. కంపెనీలకు చెందిన వినియోగదారులకు హెల్ప్ డెస్క్ ద్వారా అవసరమైన సమాచారాన్ని మనుషులకు బదులు చాట్బోట్లు చేస్తున్నాయి. ఇలా చాట్‌బోట్ అప్లికేషన్లు మార్కెట్లో చాలా ఉన్నాయి. వాటిని కావాల్సిన వారు ప్లగ్ఇన్ ఇన్స్టాల్ చేసుకుంటే సరిపోతుంది. వెబ్సైట్లకే కాకుండా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ అయిన ట్విట్టర్, వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వంటి ఏఐ చాట్బోట్లు అందుబాటులో ఉన్నాయి. వర్లూప్.ఐఓ (https://verloop.io/) పేరుతో ఉన్న కంపెనీ వెబ్సైట్లో అవసరమైన చాట్బోట్లను రూపొందించి ఇస్తుంది. అదేవిధంగా ఎల్లో.ఏఐ, జైపర్ ఏఐ, మైక్రోసాఫ్ట్ బింగ్ ఏఐ, చాట్స్పాట్, పర్సనల్ ఏఐ… ఇలా పదుల సంఖ్యలోనే చాట్‌బోట్ అందుబాటులో ఉన్నాయి. ఇవన్నీ మనుషులు చేసే పనులన్నీ కంప్యూటర్లలో చేస్తాయి. ఇలా కంప్యూటర్‌పై రకరకాల పనులు మనుషులు చేస్తుండగా, వాటి స్థానంలో ఏఐ పరిజ్ఞానంతో రూపొందించిన సాఫ్ట్వేర్ టూల్స్ ఆయా పనులను ఎంచక్కా చేసి పెడుతున్నాయి. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ఇమేజ్, కోడ్, వీడియో, స్పీచ్, 3డీ, రీసెర్చ్, టెక్ట్లకు సంబంధించిన పనులు చేసే ఏఐ టూల్స్ పదుల సంఖ్యలో అందుబాటులో ఉన్నాయి.
కంప్యూటర్‌పై సృష్టించిన రోబో భౌతికంగా మనుషుల స్థానంలోకి వచ్చి రకరకాల పనులు చేస్తున్నట్లుగానే, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంగా మారిన ఏఐ అదే కంప్యూటర్లో మనుషులు చేసే పనులను చేసేందుకు సిద్ధంగా ఉంది. ఇందుకోసం ఐటీ నిపుణులు అవసరమైన సాఫ్ట్వేర్ టూల్స్‌ను అభివృద్ధి చేసి ఆన్లైన్లోనే అందుబాటులోకి తీసుకువస్తున్నారు. ఇటీవల కాలంలో మీడియా రంగంలో ఏఐ యాంకర్ పరిచయం అలాంటిదే. ముందుగానే ఏఐ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన సాఫ్ట్వేర్ అప్లికేషన్ దానితో రకరకాల పనులు చేయించుకునేందుకు అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.