బన్సీలాల్‌పేట్, జనవరి 30 : జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని యథావిధిగా కొనసాగించాలని, కొత్తగా తెచ్చిన వీబీజీరామ్‌జీ చట్టాన్ని రద్దు చేయాలని ఉపాధి హామీ పథకం పరిరక్షణ ఐక్య వేదిక నాయకులు డిమాండ్ చేశారు.
శుక్రవారం గాంధీ దవాఖాన ఎదురుగా మహాత్మా గాంధీ విగ్రహం వద్ద తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్షుడు నాగయ్య, ప్రధాన కార్యదర్శి వెంకట్రాములు, దళిత బహుజన సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి శంకర్ తదితరులు ధర్నా చేశారు.