ఇంక్రిమెంట్లపై జాప్యం చేస్తే ఉద్యమం
పెండింగ్‌లో ఉన్న తమ ఇంక్రిమెంట్స్‌ను వెంటనే విడుదల చేయాలని తెలంగాణ అగ్రికల్చరల్ సైంటిస్ట్స్ అసోసియేషన్ (టాసా) సభ్యులు డిమాండ్ చేశారు. సోమవారం రాజేంద్రనగర్‌లోని ప్రొ.జయశంకర్ తెలంగాణ విశ్వవిద్యాలయం ఉపాధ్యాయులు, ఉద్యోగులు వీసీ భవనం వద్దకు చేరుకుని సంబంధిత అధికారి రీసెర్చ్ డైరెక్టర్ డా.బలరామ్‌కు వినతిపత్రం అందజేశారు. అనంతరం విలేకరులతో వారు మాట్లాడారు.
- టాసా ఆధ్వర్యంలో వ్యవసాయ వర్సిటీ ఉపాధ్యాయుల నిరసన
వ్యవసాయ యూనివర్సిటీ: పెండింగ్‌లో ఉన్న తమ ఇంక్రిమెంట్స్‌ను వెంటనే విడుదల చేయాలని తెలంగాణ అగ్రికల్చరల్ సైంటిస్ట్స్ అసోసియేషన్ (టాసా) సభ్యులు డిమాండ్ చేశారు. సోమవారం రాజేంద్రనగర్‌లోని ప్రొ.జయశంకర్ తెలంగాణ విశ్వవిద్యాలయం ఉపాధ్యాయులు, ఉద్యోగులు వీసీ భవనం వద్దకు చేరుకుని సంబంధిత అధికారి రీసెర్చ్ డైరెక్టర్ డా.బలరామ్‌కు వినతిపత్రం అందజేశారు. అనంతరం విలేకరులతో వారు మాట్లాడారు. న్యాయమైన డిమాండ్ల కోసం కార్యాలయం చుట్టూ నెలల తరబడి తిరిగినా.. ప్రభుత్వం వద్ద పెండింగ్ ఉందని సాకులు చెబుతూ కాలయాపన చేశారన్నారు.
ఇంక్రిమెంట్లపై ఎంత జాప్యం చేస్తే తమ ఉద్యమాలు మరింత ఉధృతం చేస్తామన్నారు. 2016 ఏడాది జీవో 15 ప్రకారం ఎంఎస్సీ(అగ్రి, హార్టికల్చర్), ఎంటెక్ (అగ్రి ఇంజినీరింగ్) తదితర పీజీ పూర్తిచేసిన అధ్యాపకులకు, శాస్త్రవేత్తలకు మంజూరైన రెండు అడ్వాన్స్ ఇంక్రిమెంట్స్‌ను ఉపసంహరించడం, రికవరీ చేయడం తగదన్నారు. టాసా ప్రధాన కార్యదర్శి డా.సౌజన్య, ఉపాధ్యక్షులు కమలాకర్, ప్రశాంత్, డా.రాకేష్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

