వ్యవసాయ యూనివర్సిటీ : ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని నాన్ టీచింగ్ ఉద్యోగుల గుర్తింపు సంఘం ఎన్నికలు శుక్రవారం ప్రశాంతంగా జరిగాయి. అధ్యక్షులుగా మాజీ అధ్యక్షులు ఎన్ శ్రీనివాస్ యాదవ్, పీ మహేష్ రెండు ప్యానళ్లుగా ఏర్పడి బరిలో నిలిచారు. తమదంటే తమది గెలుపుగా గత వారం రోజులుగా ప్రచారం నిర్వహించుకున్నారు. రాజేంద్రనగర్ క్యాంపస్‌లోనే దాదాపు 400 ఓటర్లు ఉండడంతో ఎక్కువ ప్రచారం ఇక్కడే నిర్వహించారు.
రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 697 ఓట్లు ఉండగా, అందులో ఇటీవల ఇద్దరు వ్యక్తులు రిటైర్డ్ అయ్యారు. దాదాపుగా శుక్రవారం 95% ఓటింగ్ జరిగిందని, శనివారం రాజేంద్రనగర్‌లోని క్యాంపస్‌లో ఓట్ల లెక్కింపు ఉంటుంది. గత కొన్నేళ్లుగా చేయడంవల్ల ఈసారి కూడా తమదే గెలుపని శ్రీనివాస్ యాదవ్ ధీమా వ్యక్తం చేశారు. సభ్యులు కొత్త తరాన్ని కోరుకుంటున్నారంటూ ప్రత్యర్థి పీ మహేష్ తమదే గెలుపుగా భావిస్తున్నారు. శ్రీనివాస్ యాదవ్ ప్యానల్లో అసోసియేట్ ప్రెసిడెంట్‌గా ఎం రాజు, ఉపాధ్యక్షులుగా ఎం దశరథం, ప్రధాన కార్యదర్శిగా జయరాజు, సంయుక్త కార్యదర్శిగా పరమేశ్ పోటీలో ఉండగా.. ఉపాధ్యక్షులుగా ఎం కృష్ణ, ప్రధాన కార్యదర్శిగా అమృత్ రెడ్డి, సంయుక్త కార్యదర్శిగా శ్రీధర్, కార్యనిర్వాహక కార్యదర్శిగా సోమ కవిత తదితరులు పోటీలో ఉన్నారు. తమదంటే తమది గెలుపుని ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ఈనెల 17న విశ్వవిద్యాలయం క్యాంపస్‌లో ఫలితాలు వెలవరించనున్నారు. ఎన్నికల అధికారిగా డాక్టర్ శ్రీధర్ వ్యవహరించనున్నారు. 12 కేంద్రాలలో ఎన్నికలు జరిగాయి. వాటిలో నాలుగు కేంద్రాలు రాజేంద్రనగర్‌లో ఉండగా, మిగతా ఎనిమిది కేంద్రాలు ఆయా జిల్లాలో ఉన్నాయి.