వ్యవసాయ యూనివర్సిటీ, మే 17: ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం అగ్రికల్చర్ సైంటిస్ట్ అసోసియేషన్ (టాసా)కు సంబంధించి ఈనెల 28న ఎన్నికలు జరగనున్నాయనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ ప్రొఫెసర్ అల్దాస్ జానయ్య తెలిపారు. ఈమేరకు ఆయన శనివారం ఎన్నికల నోటిఫికేషన్ జారీచేశారు. వర్సిటీకి చెందిన 447 మంది శాస్తవ్రేత్తలు, అధ్యాపకులు మూడు ప్యానల్లుగా విడిపోయి నామినేషన్లు దాఖలు చేశారు. హైదరాబాద్ రాజేంద్రనగర్‌తో పాటు పాలెం, వరంగల్, జగిత్యాల్, అశ్వరావుపేట, సంగారెడ్డి, సైఫాబాద్, రుద్రూర్లో పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు.
30 ఫలితాలు విలువడే అవకాశం ఉంది. పోటీలో మూడు ఫ్యాన్స్ టాసాకు జరుగుతున్న గుర్తింపు సంఘం ఎన్నికల్లో డాక్టర్ కే పవన్ చంద్రారెడ్డి ప్రెసిడెంట్‌గా పోటీ చేస్తుండగా, ఆ ప్యానెల్లో ప్రత్యక్షంగా డాక్టర్ కమలాకర్, ప్రధాన కార్యదర్శిగా డాక్టర్ సల్లా సౌజన్య, సంయుక్త కార్యదర్శిగా డాక్టర్ పీ రమేష్, కోశాధికారిగా డాక్టర్ జే రాజేందర్ పోటీలో ఉన్నారు. డాక్టర్ రాజేశ్వర్ నాయక్ అధ్యక్షుడిగా పోటీచేస్తున్న ప్యానల్లో ఉపాధ్యక్షుడిగా డాక్టర్ ఎస్ నవీన్ కుమార్, ప్రధాన కార్యదర్శిగా డాక్టర్ కే భానురేఖ, సంయుక్త కార్యదర్శిగా డాక్టర్ ఎం శంకర్, కోశాధికారిగా డాక్టర్ ప్రశాంత్ పోటీలో ఉన్నారు. డాక్టర్ పీ రజినీకాంత్ అధ్యక్షుడిగా పోటీ చేస్తున్న ప్యానల్లో ఉపాధ్యక్షురాలుగా డాక్టర్ రమ్య, ప్రధాన కార్యదర్శిగా డాక్టర్ బీవీ వరప్రసాద్, సంయుక్త కార్యదర్శిగా డాక్టర్ లక్ష్మీ ప్రసన్న, కోశాధికారిగా డాక్టర్ ఎండీ అలీబాబా పోటీలో ఉన్నారు.