హైదరాబాద్ : కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలు కావస్తున్నా పూర్తి స్థాయిలో మంత్రి వర్గ విస్తరణ చేపట్టకపోవడంతో వివిధ సామాజిక వర్గాల్లో అసంతృప్తి పెల్లుబికుతోంది. జనాభాలో మెజార్టీగా ఉన్నా ఆయా సామాజిక వర్గాలకు క్యాబినెట్ బెర్త్(Mnister post) దక్కకపోవడంతో అసంతృప్తికి లోనవుతున్నారు. బాహాటంగానే తమ నిరసనలు తెలియజేస్తున్నారు.
తాజాగా రాష్ట్రంలోని యాదవ(Yadavs) సామాజికవర్గానికి మంత్రివర్గంలో స్థానం కల్పించాలని డిమాండ్ చేస్తూ గాంధీ భవన్( Gandhi Bhavan) ఎదుట జాతీయ యాదవ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. యాదవులకు దమాషా ప్రకారం మూడు ఎమ్మెల్సీ పదవులు, ఐదు కార్పొరేషన్ చైర్మన్ పదవులు ఇవ్వాలని నినదించారు.
యాదవ సామాజికవర్గానికి మంత్రివర్గంలో స్థానం కల్పించాలని గాంధీ భవన్ ముందు జాతీయ యాదవ హక్కుల పోరాట సమితి నిరసన pic.twitter.com/k5EmMXxkZX
— Telugu Scribe (@TeluguScribe) September 16, 2024