Aghori Srinivas | మణికొండ, ఏప్రిల్ 23 : గత కొన్ని రోజులుగా మాయ మాటలు చెప్పి పలువురిని మోసగిస్తున్న ఓ అఘోరిని బుధవారం నార్సింగ్ పోలీసులు అరెస్టు చేశారు. ఉత్తరప్రదేశ్లో తిరుగుతున్న అఘోరి శ్రీనివాసను బుధవారం తెల్లవారుజామున నార్సింగ్ పోలీసులు అక్కడ అరెస్టు చేశారు. అనంతరం అఘోరిని నార్సింగ్ పోలీసు స్టేషన్కు తీసుకువచ్చి ఏసిపి జీవి రమణ గౌడ్ సమక్షంలో విచారణ చేపడుతున్నట్లు తెలిసింది. పూజల పేరుతో ఓ మహిళ నుండి రూ. 10 లక్షలు కాజేసి మోసం చేసిన కేసులో అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇప్పటికే అఘోరి మోసాల పట్ల ఆధారాలు సేకరించిన పోలీసులు.. అతని ద్వారా మోసపోయిన బాధితులు ఎవరైనా ఉంటే నార్సింగ్ పోలీసులు ఆశ్రయించాలని సూచించారు.