ఆహార కల్తీని అరికట్టడమే లక్ష్యం
నగర పౌరుల ఆరోగ్యాన్ని హరించివేస్తున్న ఆహార కల్తీని అరికట్టడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని నగర పోలీస్ కమిషనర్ తెలిపారు. కల్తీ నివారణ కోసం బేగంబజార్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన హెచ్ఫాస్ట్ కార్యాలయాన్ని సోమవారం సందర్శించి సిబ్బంది పనితీరును సమీక్షించారు. పర్యటనలో భాగంగా అన్ని గదులను పరిశీలించా రు.
- హెచ్ఫాస్ట్ ఆధ్వర్యంలో నగర వ్యాప్తంగా దాడులు
- నెల రోజుల్లో 117కేసులు నమోదు
- 129 టన్నుల కల్తీ ఆహార పదార్థాలు స్వాధీనం
సిటీబ్యూరో, ఏప్రిల్ 13(నమస్తే తెలంగాణ) :నగర పౌరుల ఆరోగ్యాన్ని హరించివేస్తున్న ఆహార కల్తీని అరికట్టడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని నగర పోలీస్ కమిషనర్ తెలిపారు. కల్తీ నివారణ కోసం బేగంబజార్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన హెచ్ఫాస్ట్ కార్యాలయాన్ని సోమవారం సందర్శించి సిబ్బంది పనితీరును సమీక్షించారు. పర్యటనలో భాగంగా అన్ని గదులను పరిశీలించా రు. క్షేత్రస్థాయి సిబ్బందితో సమావేశమై విధు ల్లో వారు ఎదుర్కొంటున్న సవాళ్లు, ఆటంకాలను అడిగి తెలుసుకున్నారు.
సిబ్బంది సమస్యలను త్వరతితగతిన పరిష్కరిస్తామని భరో సా ఇచ్చారు. ఫిబ్రవరి నెల నుంచి ఇప్పటివరకు హెచ్ ఫాస్ట్ బృందాలు నగరవ్యాప్తంగా 117కేసులు నమోదు చేశాయని, సుమారు 129.34టన్నుల కల్తీ ఆహార పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అత్యంత తక్కువ సమయంలో ఈ విభాగం దేశవ్యాప్తంగా గుర్తింపు పొందడం అభినందనీయమని, ఇది సిబ్బంది సామూహిక కృషి ఫలితమేనన్నారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే కల్తీ వ్యాపారుల పట్ల కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు.
ఫుడ్ సేఫ్టీ అధికారులతో నిరంతరం సమన్వయం చేసుకుం టూ పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామని సీపీ చెప్పారు. విధుల్లో అత్యుత్తమ ప్రతి భ కనబరిచిన 108 మంది పోలీసు సిబ్బందికి సీపీ సజ్జనార్ ప్రశంసా పత్రాలు అందజేశారు. ఎవరూ అక్రమాలకు పాల్పడవద్దని, విధి నిర్వహణలో క్రమశిక్షణ తప్పితే కఠిన చ ర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టాస్క్ఫోర్స్ డీసీపీ, హెచ్ఫాస్ట్ హె డ్ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్, అడిషనల్ డీసీపీ అందె శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

