Osmania University | ఉస్మానియా యూనివర్సిటీ: ఉస్మానియా యూనివర్సిటీలో పలు పరిపాలనపరమైన పదవుల నియామకం చేపట్టారు. ఈ మేరకు ఓయూ వీసీ ప్రొఫెసర్ కుమార్ నియామక పత్రాలు అందజేశారు.
ఉస్మానియా యూనివర్సిటీ డైరెక్టరేట్ ఆఫ్ అకాడమిక్ ఆడిట్ డైరెక్టర్‌గా మ్యాథమేటిక్స్ విభాగానికి చెందిన ప్రొఫెసర్ ఎన్.కిషన్, పీజీఆర్ఆర్ సీడీఈ డైరెక్టర్‌గా స్టాటిస్టిక్స్ విభాగానికి చెందిన ప్రొఫెసర్ భట్టాచార్యులు, సెంట్రల్ ఫెసిలిటీస్ ఫర్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ (సీఎఫ్ఆర్డీ) డైరెక్టర్, ఓయూ అలుమ్నీ అసోసియేషన్ స్పెషల్ ఆఫీసర్ గా బోటనీ విభాగానికి చెందిన ప్రొఫెసర్ సుజాత, బషీర్‌బాగ్ పీజీ లా కళాశాల ప్రిన్సిపల్‌గా లా విభాగానికి చెందిన డాక్టర్ అపర్ణ నియమితులయ్యారు. ఈ సందర్భంగా వారిని పలువురు అధికారులు, అధ్యాపకులు అభినందించారు.