మూసీ ఫేజ్-1కు ఏడీబీ రుణాలు.. రూ 3500 కోట్ల నిధులకు ఆమోదం
హెచ్ఎండీఏకు చెందిన వేల కోట్ల రూపాయల భూములను తనాఖా పెట్టి ఇప్పటికే రూ. 6 వేల కోట్ల రుణాలు తీసుకు వచ్చిన ప్రభుత్వం.. ఇప్పుడు మూసీ కోసం మరో రూ. 3500 కోట్ల కోసం తనఖా పెట్టేందుకు సిద్ధం అవుతుంది.
- హెచ్ఎండీఏ, టీజీఐఐసీ నుంచి భూముల తనఖాతో రుణాల సేకరణ
సిటీబ్యూరో, అక్టోబర్ 13 (నమస్తే తెలంగాణ) : మూసీ ఫేజ్-1 ప్రాజెక్ట్ ఆర్థిక కష్టాల్లో కూరుకుపోతోంది. నిధుల సమీకరణ కోసం సరార్ ఇప్పటికే వేల కోట్ల అప్పుల రూపంలో తీసుకువస్తుంది. ఇందులో తొలి దశలో ఏడీబీ నుంచి 40 శాతంపైగా రుణాలు, మిగిలినవి భూములను తనాఖా పెట్టి సేకరించే నిధులతో ప్రాజెక్టు పనులు మొదలుపెట్టనుంది కాంగ్రెస్ ప్రభుత్వం. మూసీ ప్రాజెక్ట్ మొదటి దశ పనులకు అవసరమైన నిధులను సమకూర్చేందుకు ఏషియన్ డెవలప్ మెంట్ బ్యాంక్ ఆమోదం తెలపడంతో.. ప్రభుత్వం అప్పుల వేటను వేగవంతం చేసింది.
మొత్తం ప్రాజెక్టులో కొంత భాగం ఏడీబీ రుణం కాగా, మిగిలిన బ్యాలెన్స్ నిధుల కోసం హెచ్ఎండీఏ, టీజీఐఐసీ సంస్థల పరిధిలోని భూములను తనఖా పెట్టి మరీ నిధులు సేకరించనున్నారు. ప్రభుత్వ సంపదను, కీలక సంస్థల భూములను తాకట్టు పెట్టి ప్రాజెక్టులను ముందుకు తీసుకెళ్తుండటంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మొదటి దశలో రూ. 7,345 కోట్ల భారీ వ్యయంతో 21 కిలోమీటర్ల నదీ ప్రక్షాళన, 120 ఎకరాల్లో గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ లను చేపట్టాలని నిర్ణయించారు.
ఇందులో జోన్-1ఏలో భాగంగా హిమాయత్ సాగర్ నుంచి గాంధీ సరోవర్-బాపుఘాట్ వరకు (9.20 కి.మీ) వరకు జరిగే పనుల కోసం అంచనా వ్యయాన్ని రూ. 3,232.01 కోట్లుగా లెక్కించారు. జోన్-1బీ లోని ఉస్మాన్ సాగర్ నుంచి గాంధీ సరోవర్-బాపుఘాట్ వరకు (11.80 కి.మీ) వరకు జరిగే పనుల కోసం అయ్యే ఖర్చును రూ. 4,113.11 కోట్లతో పాటుగా, ఆపరేషన్ అండ్ మేనేజ్మెంట్ కోసం మరో 6శాతం అంటే రూ. 291.12 కోట్లు కేటాయించారు. ఈ భారీ వ్యయం కోసం ప్రభుత్వ ఖజానాపై భారం పడకుండా, పూర్తిగా అప్పుల మీద ఆధారపడుతూ హెచ్ఎండీఏ, టీజీఐఐసీల ద్వారా నిధులు సమీకరిస్తుండటం ఆర్థికంగా ఎంతవరకు సమంజసమనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. భూముల తనఖా ద్వారా అప్పుల సర్దుబాటు ప్రక్రియను కొనసాగిస్తూనే, డిసెంబర్ లోపు టెండర్లు పూర్తి చేయనున్నట్లుగా
తెలిసింది.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
- Tags
- ADB loans
- hmda
- lands
- Musi Phase-1
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

