ఎర్రగడ్డ, ఏప్రిల్ 15: దేశంలో ఇతర ఏ రాష్ట్రంలో లేని విధంగా సంక్షేమ పథకాలను అందిస్తున్న తెలంగాణ ఇతర రాష్ర్టాలకు ఆదర్శంగా నిలిచిందని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అన్నారు. ఎర్రగడ్డ డివిజన్ నేతాజీనగర్ మసీదు వద్ద శుక్రవారం ఆయన ప్రభుత్వం తరపున రంజాన్ కానుకలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గోపీనాథ్ మాట్లాడుతూ.. అన్ని మతాలను గౌరవిస్తూ ఆయా పండుగలకు కానుకలను అందజేస్తున్న సీఎం కేసీఆర్ అసలైన సెక్యులర్ నేతగా పేరు తెచ్చుకున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్ షాహీన్బేగం, మాజీ కార్పొరేటర్ మహ్మద్షరీఫ్, డివిజన్ అధ్యక్షుడు సంజీవ, ప్రధాన కార్యదర్శి షరీఫ్ఖురేషీ, అజీమ్ తదితరులు పాల్గొన్నారు.