Kalpika Ganesh | మొయినాబాద్, జూలై 29: సినీనటి కల్పిక వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. ఇటీవల నగరంలోని ఓ పబ్‌లో సిబ్బందితో గొడవకు దిగి నానా హంగామా చేసిన ఈ నటి మరోసారి తన దురుసు ప్రవర్తనతో వార్తల్లో నిలిచింది. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం కనకమామిడి గ్రామంలోని బ్రౌన్ టౌన్ రిసార్టులో సోమవారం అక్కడి సిబ్బందిపై భౌతిక దాడికి దిగింది. వివరాలోకి వెళ్తే.. తెలుగు సినీనటి కల్పిక ఇటీవల గచ్చిబౌలిలోని నానకరామ్గూడలో ఓ పబ్బులో గొడవ దిగిన విషయం తెలిసిందే. అప్పట్లో కల్పికపై మీద పబ్బు యాజమాని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.
ఆమెను అరెస్టు చేయడానికి పోలీసులు గాలిస్తుండగా ఆమె తప్పించుకుని తిరుగుతుంది. ఈ క్రమంలో సోమవారం సాయంత్రం క్యాబ్‌లో సింగిల్‌గా కనకమామిడిలోని బ్రౌన్‌టౌన్ రిసార్టుకు వచ్చిన కల్పిక.. రిసార్ట్‌లో రూమ్ తీసుకున్న కొద్ది పేపటికే.. క్యాబ్ సౌకర్యం సరిగ్గా లేదు… వైఫై సరిగ్గా రావడం లేదని రిసార్టు సిబ్బందితో వాదనకు దిగింది. అనంతరం రిసార్టు రిసెప్షన్లో ఉన్న మేనేజర్ కృష్ణ వద్దకు వెళ్లి తనకు సిగరెట్ కావాలని.. తీసుకొచ్చి ఇవ్వమని అడిగింది.
మరోసారి వివాదం సృష్టించిన సినీ నటి కల్పిక
హైదరాబాద్ సమీపంలోని మొయినాబాద్ – కనకమామిడి ప్రాంతంలో ఉన్న బ్రౌన్ టౌన్ రిసార్ట్‌లో హంగామా సృష్టించిన నటి కల్పిక
మధ్యాహ్నం మూడు గంటల సమయంలో క్యాబ్‌లో ఒంటరిగా రిసార్ట్‌కు వచ్చి, రిసెప్షన్లో అడుగు పెట్టగానే మేనేజర్ కృష్ణపై దురుసుగా… https://t.co/BBMRRrTw8Z pic.twitter.com/u3dFzz72Ym
— Telugu Scribe (@TeluguScribe) July 29, 2025
రిసార్టులో మేము సిగరెట్ కాని, మందు కానీ తీసుకురామని, ఒకవేళ మీకు కావాలంటే మీరే తెచ్చుకోవాల్సి ఉంటుందని చెప్పాడు. దీంతో ఆగ్రహానికి లోనైన కల్పిక మేనేజర్ కృష్ణతో దురుసుగా ప్రవర్తించింది. ఫుడ్ మెనూ కార్డు, రూమ్ కీస్, రిసెప్షన్లో ఉన్న రిజిస్టర్లు కృష్ణ మోహం మీద విసిరేసి బూతులు తిట్టింది. అక్కడి సిబ్బందిపై దుర్భాషలాడి రిసార్టు నుంచి వెళ్లిపోయింది. దాదాపు 40 నిమిషాల పాటు రిసార్టులో నానా హంగామా చేసింది. కాగా నటి వ్యవహారంపై రిసార్టు యజమానులు పోలీసులకు ఫిర్యాదు చేసే యోచనలో ఉన్నట్లు సమాచారం.
సిగరెట్లు కావాలని అడిగితే రిసార్ట్ యాజమాన్యం దురుసుగా ప్రవర్తించారు
బ్రౌన్ టౌన్ రిసార్ట్ వివాదంపై స్పందించిన నటి కల్పిక
రిసార్టులో సెల్ ఫోన్లో సిగ్నల్స్ లేవని, కనీసం క్యాబ్ బుక్ చేసుకునేందుకు వైఫై కూడా లేదని అడిగితే నాతో మేనేజర్ వాగ్వాదానికి దిగాడు
ఎంత నిదానంగా చెప్పినా… https://t.co/JxoCp9PSO2 pic.twitter.com/72LGDySZ3g
— Telugu Scribe (@TeluguScribe) July 29, 2025