Hyderabad | మెహిదీపట్నం ఫిబ్రవరి 13 : బాలుడిని ఆటోలో ఎత్తుకెళ్లి అసహజ లైంగిక దాడికి పాల్పడ్డ నిందితుడికి కోర్టు గురువారం 20 ఏండ్ల జైలు శిక్షతోపాటు రూ. పది వేల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చింది.
హుమాయున్ నగర్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ మల్లేష్ తెలిపిన వివరాల ప్రకారం.. లంగర్‌హౌస్ డిఫెన్స్ కాలనీలో నివసించే మసూద్(43) ఆటో డ్రైవర్‌గా పనిచేస్తూ జీవిస్తున్నాడు. ఇతను 2018 ఏప్రిల్ 25వ తేదీన మెహిదీపట్నం ఫిల్టర్ బెడ్స్ ప్రాంతంలో నివసించే ఓ బాలుడిని ఆటోలో బలవంతంగా ఎత్తుకెళ్లి అసహజ లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన హుమాయున్ నగర్ పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఇదిలా ఉండగా గురువారం ఈ కేసులో పోక్సో కోర్టు స్పెషల్ సెషన్స్ 12వ కోర్టు జడ్జి అనిత నిందితుడికి 20 సంవత్సరాల జైలు శిక్ష, రూ. పదివేల జరిమానా విధిస్తూ తీర్పును వెలువరించారు.