సిటీబ్యూరో: ప్రముఖ గాయకుడు రాజాదిత్యాన్ అరెస్టయ్యారు. వ్యసనాలకు అలవాటుపడి.. సులువుగా డబ్బు సంపాదించే క్రమంలో గంజాయి విక్రయాలకు పాల్పడుతూ.. ఆబ్కారీ పోలీసులకు చిక్కారు. నిందితుడి వద్ద నుంచి 4.250 కిలోల గంజాయి, సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు.
సరూర్‌నగర్ డీటీఎఫ్ ఎస్ఐ శంకర్ కథనం ప్రకారం.. కొత్తపేట, గ్రీన్ హీల్స్ కాలనీకి చెందిన రాజాదిత్యాన్(22) గాయకుడు, రచయిత. వ్యసనాలకు అలవాటుపడిన రాజాదిత్యాన్.. సులువుగా డబ్బు సంపాదించేందుకు గంజాయి అమ్ముతున్నారు. సమాచారం అందుకున్న సరూర్‌నగర్ డీటీఎఫ్ పోలీసులు కొత్తపేటలోని గ్రీన్ హీల్స్ ప్రాంతంలో నిందితుడు ఉంటున్న అపార్ట్‌మెంట్‌పై దాడులు నిర్వహించారు. ఫ్లాట్‌లో 4.250కిలోల గంజాయి లభించడంతో రాజాదిత్యాన్ను అరెస్టు చేశారు.