హైదరాబాద్ నగరంలో కారు బీభత్సం సృష్టించింది. మాదాపూర్ ప్రాంతంలో శనివారం నాడు తెల్లవారు జామున ఒక కారు బీభత్సం సృష్టించింది. డ్రైవర్ ఇష్టమొచ్చినట్లు కారు నడుపడంతో అదుపుతప్పిన వాహనం.. డివైడర్ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు తీవ్రంగా గాయపడినట్లు పోలీసులు తెలిపారు. విషయం తెలియగానే ప్రమాదస్థలానికి చేరుకున్న అధికారులు.. గాయపడిన వారిని దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. అనంతరం వాహనాన్ని కూడా తరలించారు. వాహనం నడిపిన డ్రైవర్ బాగా మద్యం తాగడం వల్లనే ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.