జలమండలిలో ఏసీబీ కలకలం
జలమండలి ఫైనాన్స్ డైరెక్టర్‌పై ఏసీబీ దాడులు జరగడం కలకలం సృష్టించింది. ఏసీబీ దాడి కంటే డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన పది రోజుల్లోనే పట్టుబడటంపై జలమండలితో తీవ్ర చర్చనీయాంశమైంది.
- పట్టుబడిన ఫైనాన్స్ డైరెక్టర్..ఉద్యోగుల్లో చర్చనీయాంశం .. వాటా పంచుకున్న వాళ్లలో గుబులు?
సిటీబ్యూరో, అక్టోబర్ 25 (నమస్తే తెలంగాణ): జలమండలి ఫైనాన్స్ డైరెక్టర్‌పై ఏసీబీ దాడులు జరగడం కలకలం సృష్టించింది. ఏసీబీ దాడి కంటే డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన పది రోజుల్లోనే పట్టుబడటంపై జలమండలితో తీవ్ర చర్చనీయాంశమైంది. ఫైనాన్స్ విభాగంపై కనీస అవగాహన కూడా రాకుండానే.. బిల్లుల మంజూరు, ఆదాయ, వ్యయాలపై పూర్తి వివరాలు తెలియకుండానే పట్టుబడటంపై ఉద్యోగుల్లో పలు విధాలుగా చర్చ జరుగుతున్నది. ఉన్నతాధికారుల అండదండలతో కొంతమంది అధికారులు ఆయనను తప్పుదోవ పట్టించారనే ప్రచారం కూడా జరుగుతున్నది.
ఈనేపథ్యంలో ఆయనకు ఓ కాంట్రాక్టర్ నుంచి రూ.10 లక్షలు వచ్చినట్లు తెలుస్తున్నది. కానీ ఏసీబీ దాడుల్లో మాత్రం రూ.2.4లక్షలు మాత్రమే దొరికాయి. మిగిలిన డబ్బు అప్పటికే పంపకాలు అయ్యాయా? ఎవరెవరికి ఎంత వాటా అందింది? మిగిలిన రూ.7.60 లక్షలు ఎవరెవరు పంచుకున్నారు? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
మరోవైపు వాటా పంచుకున్న వాళ్లలో ఇప్పుడు గుబులు పట్టుకున్నట్లు సమాచారం. ఈవ్యవహారంపై ఏసీబీ అధికారులు అంతర్గత విచారణ చేపడితే తమ పేర్లు కూడా బయట పడతాయా? అనే ఆందోళనలో ఉన్నట్లు జలమండలిలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఆ అధికారులు ఆత్మరక్షణ చర్యల్లో బిజీగా ఉన్నట్లు అటెండర్ నుంచి ఉన్నతాధికారి దాకా చర్చ జరుగుతున్నది. తమ పేర్లు బయటకు వస్తే ఏం చేయాలనే తర్జనభర్జనలో ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

