Osmania University | ఉస్మానియా యూనివర్సిటీ: కేంద్ర ప్రభుత్వం మావోయిస్టులకు వ్యతిరేకంగా చేపట్టిన ఆపరేషన్ కగార్‌కు మద్దతుగా ఏబీవీపీ ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ఆవరణలో మావోయిస్టుల దిష్టిబొమ్మను మంగళవారం దహనం చేశారు.
ఈ సందర్భంగా పలువురు ఏబీవీపీ నాయకులు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఆపరేషన్ కగార్‌ను కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఎంతో మంది అమాయకులను చంపి రక్తపుటేరులు పారించిన మావోయిస్టులకు మద్దతుగా మాట్లాడుతున్న సీఎం రేవంత్ రెడ్డి నక్సలైట్ ప్రభావిత కుటుంబాలకు సాగిలపడి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. నక్సలైట్లతో కేంద్ర ప్రభుత్వం ఎందుకు శాంతి చర్చలు జరపాలో చెప్పాలన్నారు. దేశ భద్రత కోసం పనిచేస్తున్న ఎంతోమంది పోలీసులను కిరాతకంగా నక్సలైట్లు చంపారని గుర్తు చేశారు.
వారసిగూడ నూతన సీఐని కలిసిన కార్పొరేటర్
వారసిగూడ పోలీస్ స్టేషన్ నూతన సీఐగా బాధ్యతలు స్వీకరించిన మధుసూదన్ రెడ్డిని బౌద్ధ నగర్ కార్పొరేటర్ కంది శైలజ మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనను శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ కంది నారాయణ, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.