ఎస్బీఐ మేనేజర్ అధికార దుర్వినియోగం
సనత్‌నగర్ ఎస్బీఐ పూర్వ మేనేజర్ రూ. 4.75 కోట్ల నిధులను అనధికారిక లావాదేవీల ద్వారా దారి మళ్లించినట్టు బ్యాంకు అధికారులు ఆడిటింగ్‌లో గుర్తించారు. ఈ ఘటనపై ఎస్బీఐ సనత్‌నగర్ తాజా మేనేజర్ రామచంద్ర రాఘవేంద్ర ప్రసాద్ సనత్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
- వివిధ పద్ధతుల ద్వారా రూ. 4.75 కోట్ల దారి మళ్లింపు
- ఆడిటింగ్‌లో వెలుగు చూసిన అక్రమాలు
- సనత్‌నగర్ పీఎస్‌లో కేసు నమోదు
అమీర్‌పేట, జనవరి 10 : సనత్‌నగర్ ఎస్బీఐ పూర్వ మేనేజర్ రూ. 4.75 కోట్ల నిధులను అనధికారిక లావాదేవీల ద్వారా దారి మళ్లించినట్టు బ్యాంకు అధికారులు ఆడిటింగ్‌లో గుర్తించారు. ఈ ఘటనపై ఎస్బీఐ సనత్‌నగర్ తాజా మేనేజర్ రామచంద్ర రాఘవేంద్ర ప్రసాద్ సనత్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. గతంలో సనత్‌నగర్ ఎస్బీఐకి మేనేజర్‌గా కార్తీక్‌రాయ్ కొనసాగారు. 20 జూన్ 2020 నుంచి 16 జూన్ 2023 మధ్య కాలంలో అనధికార లావాదేవీలను నిర్వహించారు.
ఈ లావాదేవీలను గుర్తించినట్టు తాజా మేనేజర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బ్యాంకు ద్వారా రుణాలు పొందిన ఖాతాదారులకు మీ రుణాలు రద్దు చేస్తామని చెప్పి.. మళ్లీ రుణాలు మంజూరు చేశారు. అయితే, మేనేజర్ చెప్పిన ప్రకారం రుణాలు రాకపోగా, ఖాతాదారులకు తెలియకుండా మంజూరు చేసిన రుణాలను 3వ పార్టీ ఖాతాలకు మళ్లించారు. తాము మోసపోయిన విషయాన్ని గ్రహించిన ఖాతాదారులు మేనేజర్ కార్తీక్ రాయ్‌ను నిలదీయగా, ఇందుకు సాంకేతిక కారణాలను చూపి అప్పట్లో వారిని శాంతింపజేశారు.
జరిగిన తప్పిదానికి తానే ఈఎంఐలు చెల్లిస్తానని హామీ కూడా ఇచ్చారు. మేనేజర్‌గా తనకు అవకాశం ఉన్న కార్యకలాపాల ద్వారా మొత్తం రూ. 4,75,98,979 లను దారి మళ్లించినట్టు బ్యాంకు మేనేజర్ రామచంద్ర రాఘవేంద్ర ప్రసాద్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు సనత్‌నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని ఇన్స్పెక్టర్ ఎ. పురేందర్‌రెడ్డి తెలిపారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
- Tags
- Sanatnagar
- sbi
- SBI Manager
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

