Traffic Challan | చలాన్ చెల్లించమంటే.. ద్విచక్ర వాహనానికి నిప్పు పెట్టాడు
పెండింగ్ చలాన్ చెల్లించమంటే ఓ యువకుడు ద్విచక్ర వాహనానికి నిప్పు పెట్టాడు. ఈ సంఘటన మంగళవారం శంషాబాద్ ఆర్జీఐఏ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది.
Traffic Challan | శంషాబాద్ రూరల్, జూన్ 20: పెండింగ్ చలాన్ చెల్లించమంటే ఓ యువకుడు ద్విచక్ర వాహనానికి నిప్పు పెట్టాడు. ఈ సంఘటన మంగళవారం శంషాబాద్ ఆర్జీఐఏ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. ట్రాఫిక్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శంషాబాద్ పట్టణంలోని పుల్లారెడ్డి స్వీట్ హౌజ్ వెనుక వ్యవసాయ క్షేత్రంలో నివాసముండే ఎండీ ఫసియోద్దీన్ తన ద్విచక్ర వాహనంపై రోడ్డుపైకి వచ్చాడు. అతడి ద్విచక్ర వాహనంపై రూ. 9000 చలాన్లు పెండింగ్‌లో ఉన్నాయి. చలాన్ చెల్లించాలంటూ పలుమార్లు ట్రాఫిక్ పోలీసులు సూచించినా.. రేపు మాపు అంటూ గడువు తీసుకున్నాడు.
మంగళవారం మరోసారి అతడు పోలీసుల తనిఖీల్లో పట్టుబడటంతో పెండింగ్ చలాన్లు చెల్లించాలని ఆదేశించారు. దీంతో అతడు తన ద్విచక్ర వాహనానికి నిప్పు అంటించాడు. గమనించిన పోలీసులు వెంటనే మంటలు ఆర్పివేశారు. ఎలాంటి నష్టం జరగకపోవడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Plane crash | అమెరికాలో ఘోర విమాన ప్రమాదం.. ఆరుగురు మృతి
Actress | “నేను ఈ సినిమా ఫీల్డ్‌కు సరిపోనేమో అనిపిస్తుంది”.. ప్రీ రిలీజ్ వేడుకలో కన్నీళ్లు పెట్టుకున్న నటి
Bigg Boss 10 | బిగ్‌బాస్ హౌస్‌లో రోహిత్‌కు ‘డ్రామా కింగ్’ ట్యాగ్.. షాలినికి విక్టిమ్ కార్డు, ముఖేష్‌కు మానిప్యులేటర్ బిరుదు!
Flyover Projects | ఫ్లైఓవర్ల కింద విద్యుత్ సబ్ స్టేషన్లు.. ప్రజాభద్రతకు ప్రమాదం.. విద్యుత్ రంగ నిపుణులు
TG-SAFE | ఇవి తింటే రోగాలే..! టీజీసేఫ్ తనిఖీల్లో విస్తుపోయే విషయాలు వెలుగులోకి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

