బండ్లగూడ, జులై 1 : హిమాయత్ సాగర్లో దూకి ఉపయోగపడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హిమాయత్ సాగర్ కు చెందిన ముఖేష్ (30) గత కొంతకాలంగా చెడు తిరుగులకు అలవాటు పడి దొంగతనాలు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. పలు కేసులలో జైలుకు కూడా వెళ్లి వచ్చాడు.
దీంతో అతనికి కుటుంబ సభ్యులతో పాటు స్థానికులు అలాంటి పనులు చేయవద్దని పలుమార్లు సూచించిన ఫలితం లేకుండా పోయింది. దీంతో అతన్ని ఎవరు పట్టించుకోకపోవడంతో జీవితంపై విరక్తి చెంది హిమా యత్ సాగర్లో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇది పరిశీలించిన అక్కడి సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం ఉస్మాని యా మార్చరికి తరలించారు. కేసు దర్యాప్తులో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.