బంజారాహిల్స్, జూలై 22: లూడో గేమ్‌కు బానిసగా మారి లక్షలాది రూపాయలు పోగొట్టుకున్న యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. మహబూబ్‌నగర్ జిల్లా నర్వ మండలం జక్లేర్ గ్రామానికి చెందిన గడ్డమీది వెంకటేశ్ (23) బంజారాహిల్స్ రోడ్ నం.14లోని రోస్ట్ కేఫ్‌లో గార్డెనింగ్ పనులు చేస్తుంటాడు.
కొంతకాలంగా ఆన్లైన్లో లూడో గేమ్‌తో పాటు కొన్ని బెట్టింగ్ యాప్స్‌ను వాడుతున్న వెంకటేష్ సుమారు రూ.6 లక్షల దాకా అప్పులు చేసి ఆర్థిక సమస్యల్లో చిక్కుకున్నాడు. వేధింపులు తట్టుకోలేక రెండు రోజుల క్రితం ఆత్మహత్యకు యత్నించగా గమనించిన స్నేహితులు నిమ్స్‌లో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మరణించాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.