సిటీబ్యూరో, ఏప్రిల్19(నమస్తే తెలంగాణ): కమ్యూనిటీ గ్రూప్స్‌లోని వాట్సాప్ ద్వారా ఒక మహిళకు తక్కువ వడ్డీకి లోన్ ఇస్తామంటూ ఆశచూపి ఆమె దగ్గర నుంచి అరకోటి కొట్టేశారంటూ హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్‌స్టేషన్‌కు ఫిర్యాదు అందింది. సికింద్రాబాద్‌కు చెందిన 59 ఏళ్ల మహిళకు ఒక కమ్యూనిటీకి చెందిన వాట్సాప్ గ్రూప్‌లో అర్హతను బట్టి కేవలం రెండు గంటల్లో అతి తక్కువ వడ్డీకి రూ.15లక్షల లోన్ మంజూరు చేస్తామంటూ మెసేజ్ వచ్చింది.
ఆ మెసేజ్ మహాలక్ష్మి ఫైనాన్స్ నుండి వచ్చినట్లుగా కాంటాక్ట్ నంబర్ కూడా ఉండడంతో వివరాల కోసం ఆ మహిళ సదరు నంబర్లో సంప్రదించారు. తన సిబిల్ స్కోర్ రుణానికి అర్హత పొందేందుకు చాలా తక్కువగా ఉందని బాధితురాలికి ఫోన్నెంబర్లో కాంటాక్ట్ అయిన వ్యక్తి చెప్పా డు. అంతేకాకుండా గురుకృపా ట్రేడర్స్ పేరుతో యూపీఐ స్కానర్‌ను పంపుతున్నానని , కొంత మొత్తం చెల్లిస్తే సిబిల్ క్లియర్ చేసి రుణం మంజూరు చేస్తామని చెప్పారు.
ఈ డబ్బులు లోన్‌తో పాటు తిరిగి ఇస్తామని నమ్మించాడు. దీన్ని నమ్మి బాధితురాలు డబ్బులు చెల్లించింది. ఆ తర్వాత మోసగాడు బాధితురాలి ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, చెక్ లీఫ్ ల ఫొటోలను షేర్ చేయాలని సూచించగా ఆమె తనకు వచ్చిన నెంబర్‌కు అవన్నీ పంపారు. ఈ విషయాన్ని తన సోదరుడికి చెప్పడంతో షేర్ చేసిన ఫొటోలను తీసేయాలంటూ ఆయన సలహా ఇచ్చాడు. తర్వాత మళ్లీ సైబర్ మోసగాడు ఫోన్ చేసి లోన్ ప్రాసెస్‌లో ఉందని, అయితే బాధితురాలు ఫొటోలను ఎందుకు తీసేశారని అడిగాడు.
ఈ ప్రక్రియలో కొంత పెనాల్టీ పడుతుందని అది చెల్లించాలంటూ మరొక యూపీఐ స్కానర్ పంపించగా బాధితురాలు డబ్బులు చెల్లించారు. బాధితురాలి ఎస్బిఐ బ్యాంక్ స్టేట్మెంట్లో బ్యాలెన్స్ సరిపోలేదని, మరో జరిమానా విధించిందని, అది కూడా చెల్లించిందని తాను ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రతిసారీ మోసగాళ్లు కొత్త సమస్యలను క్లెయిమ్ చేసి మరిన్ని పెనాల్టీలు వేయడంతో తన ఖాతాలో తగినంత డబ్బులు లేకపోవడంతో , పేమెంట్స్ చేయడానికి స్నేహితులు మరియు కుటుంబ సభ్యుల నుండి డబ్బు తీసుకున్నాడు.
సైబర్‌నేరగాళ్లు బాధితురాలికి తర్వాత మొత్తం అందినట్లు ధృవీకరించి సాక్ష్యంగా స్కీన్ష్రాట్లను తేదీ లేదా సమయం లేకుండా పంపారు. లోన్ విడుదల చేసేందుకు హెడ్ ఆఫీస్ త్వరలో బాధితురాలిని సంప్రదిస్తుందని పేర్కొంటూ వారు ఆమెకు వాట్సాప్‌లో మెసేజ్ చేశారు. కొంత సమయం తర్వాత మరిన్ని డబ్బులు కావాలని లేకపోతే లోన్ ఆగిపోతుందని బెదిరించారు.
అప్పటికే బాధితురాలి ఎస్బిఐ ఖాతా నుండి 25 ఆన్లైన్ యూపీఐ లావాదేవీల ద్వారా నేరగాళ్లకు రూ.44, 83,000 ముట్టాయి. లోన్ అమౌంట్‌తో పాటు బాధితురాలు కట్టిన పెనాల్టీలు కూడా తిరిగి ఇస్తామని, మరిన్ని డబ్బులు ఇవ్వమనడంతో ఆమె ఒప్పుకోలేదు. దీంతో వారు స్పందించడం మానేశారు. తాను మోసపోయానని గ్రహించిన బాధితురాలు సైబర్‌క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.