కాచిగూడ, అక్టోబర్ 11: అనుమానాస్పద స్థితిలో చాదర్ఘాట్ బ్రిడ్జి పైనుంచి దూకి గుర్తు తెలియని ఓ మహిళ ఆత్మహత్య చేసుకున్నది. ఈ ఘటన కాచిగూడ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. ఇన్స్పెక్టర్ చంద్రకుమార్ కథనం ప్రకారం.. సుమారు (42) ఏండ్ల వయసున్న ఓ మహిళ శుక్రవారం చాదర్ఘాట్ పెద్ద బ్రిడ్జిపై కూర్చొని.. కిందకు దూకింది. స్థానికులు ఇచ్చిన సమాచారంతో కాచిగూడ అడ్మిన్ ఎస్సై డి.సుభాష్ ఘటనా స్థలానికి చేరుకొని.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా దవాఖానకు తరలించారు. మృతురాలి ఒంటిపై నీలి రంగు కుర్థా, పైజమా ఉన్నదని, ఎత్తు 5.1 అడుగులు ఉన్నట్టు తెలిపారు. ఆమె వివరాలు తెలిస్తే 8712660540, 8712660542లో సంప్రదించాలని కోరారు. ఈ కేసును కాచిగూడ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. ఇది హత్యా..? ఆత్మహత్యా..? అనే కోణంలో కేసు దర్యాప్తు చేస్తున్నట్టు అడ్మిన్ ఎస్ఐ తెలిపారు.