గాంధీ ఆస్పత్రిలో అనుమానాస్పదస్థితిలో రోగి మృతి
Gandhi Hospital | నగరంలోని గాంధీ ఆస్పత్రిలో విషాదం చోటు చేసుకుంది. ఓ రోగి ఆస్పత్రి ఐదో అంతస్తు నుంచి కిందపడి మృతి చెందాడు. ఆ రోగి ఆత్మహత్య చేసుకున్నాడా? లేక ప్రమాదవశాత్తు

హైదరాబాద్ : నగరంలోని గాంధీ ఆస్పత్రిలో విషాదం చోటు చేసుకుంది. ఓ రోగి ఆస్పత్రి ఐదో అంతస్తు నుంచి కిందపడి మృతి చెందాడు. ఆ రోగి ఆత్మహత్య చేసుకున్నాడా? లేక ప్రమాదవశాత్తు కాలు జారి పడ్డాడా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతి చెందిన వ్యక్తి కరోనా రోగి అని తెలుస్తోంది. రోగి గుర్తు తెలియని వ్యక్తి కావడంతో డెడ్ బాడీని గాంధీ ఆస్పత్రి మార్చురీలో పోలీసులు భద్రపరిచారు.
కరోనా కేసులు అధికమవుతున్న నేపథ్యంలో గాంధీ ఆస్పత్రిలో అత్యవసరం కాని సర్జరీలను నిలిపివేయాలని ప్రభుత్వం ఇటీవలే ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. గాంధీలో పూర్తిస్థాయిలో కరోనా రోగులకు సేవలందించాలని తెలిపింది. ఈ క్రమంలో గాంధీలో కరోనా రోగులకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం కొత్తగా మూడువేల కేసులు నమోదైన సంగతి తెలిసిందే. మంగళవారం 1,07,904 మందికి పరీక్షలు చేయగా.. 2,983 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. కొవిడ్ సమస్యలతో ఇద్దరు మరణించారు. 2,706 మంది కరోనా నుంచి కోలుకున్నారు. 22,472 మంది ఐసొలేషన్‌లో చికిత్స పొందుతున్నా రు. అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 1,206, మే డ్చల్ మల్కాజిగిరిలో 259, రంగారెడ్డిలో 227, సం గారెడ్డిలో 96 కేసులు వెలుగుచూశాయి. యాక్టివ్ కేసుల సంఖ్య 22 వేలు దాటింది. రాష్ట్ర పరిపాలనా కేంద్రమైన బీఆర్కేభవన్లో పలు విభాగాల్లో అధికారులు, సిబ్బంది పదుల సంఖ్యలో కరోనా బారిన పడ్డారు. బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ కార్యాలయంలో పలువురు ఉద్యోగులకు కూడా కరోనా సోకింది.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Thulabharam | రవితేజ, వివేక్ ఆత్రేయ క్రేజీ కాంబో.. ‘తులాభారం’ టైటిల్ గ్లింప్స్ వచ్చేసింది!
Prabhas Birthday | ప్రభాస్ బర్త్‌డే కానుక.. థియేటర్లలో సందడి చేయనున్న డార్లింగ్ బ్లాక్‌బస్టర్ మూవీస్ ‘వర్షం’, ‘ఛత్రపతి’!
Warangal | వరంగల్ భద్రకాళి ఆలయంలో భక్తుల రద్దీ.. ఏర్పాట్లలో విఫలమైన అధికార యంత్రాంగం
George Krish | జూనియర్ సైంటిస్ట్‌గా శర్వానంద్.. రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘జార్జ్ క్రిష్’ ఊరమాస్ షూటింగ్!
CJP | నిరసన గళాలకు కోర్టులో ఊరట.. విడుదలైన అభిజిత్ దీప్కే బృందం.. వీడియో..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

