Road Accident | మణికొండ, మార్చి 19 : నార్సింగి ఔటర్ సర్వీస్ రోడ్డులో ఆటో, బైక్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బైక్పై వెళ్తున్న ట్రాఫిక్ కానిస్టేబుల్ తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ప్రమాద ఘటన నార్సింగ్ పోలీసు స్టేషన్ పరిధిలో బుధవారం చోటు చేసుకుంది.
పూర్తి వివరాల్లోకి వెళితే నార్సింగ్ నుంచి గచ్చిబౌలి వైపు ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్ తన ద్విచక్ర వాహనంపై అతివేగంగా వెళ్తుండగా వెనకాల నుంచి వస్తున్న ఆటో డ్రైవర్ అదే స్పీడ్లో వచ్చి ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో కానిస్టేబుల్ ఎడమ కాలు విరిగింది. జరిగిన ప్రమాదాన్ని గమనించిన ఆటో డ్రైవర్ రోడ్డుపై ఆటో వదిలేసి పరుగులు తీస్తుండగా స్థానికులు అతని పట్టుకొని నార్సింగ్ పోలీసులకు అప్పగించారు. ఈ మేరకు నార్సింగి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.