శంషాబాద్ రూరల్, సెప్టెంబర్ 1 ః రాంగ్రూట్లో వచ్చి ద్విచక్ర వాహనాన్ని టిప్పర్ ఢీకొవడంతో ఒకరు మృతి చెందిన సంఘటన ఆదివారం రాత్రి శంషాబాద్‌లోని తొండుపల్లి వద్ద జరిగింది. సీఐ నరేందర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్- బెంగుళూరు జాతీయ రహదారిలో తొండుపల్లి వద్ద బ్రిడ్జిపైన రోడ్డు ప్రమాదం జరిగిన్నట్లు సమాచారం రావడంతో వెంటనే అక్కడికి వెళ్లిన పోలీసులు ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు.
శంషాబాద్ వైపు నుంచి షాద్‌నగర్ వైపు వస్తున్న ద్విచక్ర వాహనాన్ని రాంగ్రూట్లో వచ్చిన టిప్పర్ ఢీకొవడంతో బైక్‌పై వ్యక్తి కిందపడిపోగా, తలపై నుంచి ట్రిప్పర్ వెళ్లింది. దీంతో సదరు వ్యక్తి అక్కడిక్కడే మృతి చెందారు. స్థానికులు చూసి టిప్పర్‌ను ఆపి చూడగా, డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నాడు. మృతి చెందిన వ్యక్తి కొత్తూరు మండలంలోని కుమ్మరిగూడ గ్రామానికి చెందిన బండారు రాజేస్‌గౌడ్(33)గా గుర్తించారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.