ఖైరతాబాద్, జనవరి 10 : హైదరాబాద్ బుక్ ఫేయిర్ ఆధ్వర్యంలో గత నెల 19 నుంచి 29వ తేదీ వరకు నిర్వహించిన పుస్తక ప్రదర్శనకు విశేష స్పందన లభించిందని, ఈ ఏడాది రూ.7కోట్లకు పైగా పుస్తకాల విక్రయాలు జరిగాయని అధ్యక్షుడు డాక్టర్ యాకుబ్ షేక్ తెలిపారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈసారి బుక్‌ఫెయిర్‌కు సుమారు పది లక్షలకు మందికి పైగా సందర్శకులు వచ్చారని వెల్లడించారు.