Snake | హైదరాబాద్ : హిమాయత్‌నగర్ లిబర్టీ కూడలిలో ఓ పాము కలకలం సృష్టించింది. కేబుల్ వైర్లపై నుంచి సిగ్నల్ పౌలు వద్దకు వెళ్తున్న ఓ పామును చూసి వాహనదారులు తమ వెహికిల్స్‌ను రోడ్డుపైనే ఆపేశారు. ఆ పామును తమ కెమెరాల్లో బంధించారు. పామును వీడియోలు తీసుకోవడంతో గంట పాటు లిబర్టీ కూడలి వద్ద గంటపాటు ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సిగ్నల్ పౌలు నుంచి దిగి పక్కన ఉన్న ఖాళీ భవనంలోకి పాము వెళ్లిపోయింది. పాము అటు నుంచి వెళ్లిపోయిన తర్వాత ట్రాఫిక్ పోలీసులు వాహనాలను క్లియర్ చేశారు.