బేగంపేట్, ఆగస్టు 9 : రాఖీ కట్టి ధైర్యం చెప్పడం ఒకటి.. ప్రాణపాయ స్థితిలో ఉన్న తమ్ముడి ప్రాణం కాపాడటం మరోటి.. ఆ రెండవది చేయాలంటే అసాధారణ ధైర్యం కావాలి. మానవ సంబంధాలు క్రమంగా క్షీణిస్తున్న ఈ రోజుల్లో ఒక అక్క తన తమ్ముడి ప్రాణలకే సవాలు విసిరింది.
మహబూబ్‌నగర్‌కు చెందిన ఐదేళ్ల బాలుడికి తీవ్రమైన అప్లాస్టిక్ అనీమియా అంటే ఎముక మజ్జ లోపంగా నిర్థారణ అయింది. ఇంటర్ చదువుతున్న అక్క తమ్ముడికి ధైర్యం చెప్పి తన శరీరంలోని మూల కణాలను దానం చేసి అతనికి ఊపిరి పోసింది. రాఖీ పండగ రోజున సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో తమ్ముడికి రాఖీ కట్టి నీ కోసం నేనున్నాను తమ్ముడు అని ప్రేమగా చెప్పింది. అ సంధర్భంగా డాక్టర్ నరేందర్‌కుమార్ మాట్లాడుతూ.. ఇది అక్కా తమ్ముళ్ల అనుబంధానికి నిజమైన నిదర్శనమని అపోహలను పక్కన పెట్టి ధైర్యంగా తమ్ముడి ప్రాణాలను కాపాడిందని అన్నారు.