ఈ నగరానికి ఏమైంది? కాల్పుల కలకలం
కోఠిలో కాల్పుల కలకలం చేటుచేసుకున్నది. ఏటీఎంలో నగదు జమ చేసేందుకు వచ్చిన బట్టల వ్యాపారిపై దుండగులు కాల్పులు జరిపి..6 లక్షల నగదు, బైక్‌ను దోచుకెళ్లారు. అడిషనల్ డీసీపీ ఆనంద్ సుల్తాన్‌బజార్ ఏసీపీ మైనం మట్టయ్య, సుల్తాన్‌బజార్ ఇన్‌స్పెక ్టర్ నరసింహ తెలిపిన వివరాల ప్రకారం.. కేరళ రాష్ట్రం కోజికోడ్, కొడవల్లి గ్రామానికి చెందిన రిన్షాద్ పీవీ(26) తన సొంత గ్రామంలో రెడిమేడ్ పిల్లల దుస్తుల వ్యాపారి.
- కోఠిలో ఏటీఎంకు వచ్చి..
- వ్యాపారిపై దుండగుల గన్‌ఫైర్
- ఆరు లక్షల నగదు, బైక్‌తో పరార్
సుల్తాన్‌బజార్, జనవరి 31: కోఠిలో కాల్పుల కలకలం చేటుచేసుకున్నది. ఏటీఎంలో నగదు జమ చేసేందుకు వచ్చిన బట్టల వ్యాపారిపై దుండగులు కాల్పులు జరిపి..6 లక్షల నగదు, బైక్‌ను దోచుకెళ్లారు. అడిషనల్ డీసీపీ ఆనంద్ సుల్తాన్‌బజార్ ఏసీపీ మైనం మట్టయ్య, సుల్తాన్‌బజార్ ఇన్‌స్పెక ్టర్ నరసింహ తెలిపిన వివరాల ప్రకారం.. కేరళ రాష్ట్రం కోజికోడ్, కొడవల్లి గ్రామానికి చెందిన రిన్షాద్ పీవీ(26) తన సొంత గ్రామంలో రెడిమేడ్ పిల్లల దుస్తుల వ్యాపారి.
బట్టల వ్యాపారం నిమిత్తం ఆరు లక్షల నగదుతో నగరానికి ఈ నెల 7న వచ్చాడు. నాంపల్లి సిటీ కన్వెన్షన్ వద్ద ఉన్న జనతా రెసిడెన్సీ అపార్ట్మెంట్లో నివసిస్తున్నాడు. 24 రోజులుగా అక్కడే ఉంటూ చార్మినార్, మదీనాలతో దీవాన్దేవ్డీలో హోల్‌సేల్ స్టాక్ కొనుగోలు నిమిత్తం తిరిగినా..దుస్తులు నచ్చకపోవడంతో తిరిగి తన సొంత గ్రామానికి వెళ్లేందుకు సిద్ధమయ్యాడు. తన సమీప బంధువు, యజమాని మిషబ్కు ఆరు లక్షల నగదును పంపించేందుకు శనివారం కోఠి బ్యాంక్‌స్ట్రీట్‌లోని ఎస్బీఐ ప్రధాన శాఖ ఏటీఎం వద్దకు తన స్నేహితుడు అమీర్ ద్విచక్రవాహనాన్ని తీసుకొని సుమారు 6.50 నిమిషాల ప్రాంతంలో అక్కడికి చేరుకున్నాడు.
నగదుతో ఉన్న బ్యాగును దోపిడీ చేసేందుకు ఇద్దరు దుండగులు రిన్షాద్‌పై రివాల్వర్‌తో కాల్పులు జరుపగా ఓ బుల్లెట్ మిస్‌ఫైర్ అయ్యింది. మరో బుల్లెట్ కాలి మోకాలి కింది భాగంలో తాకుతూ కిందపడిపోయింది. దీంతో ఇద్దరు నిందితులు నగదుతో ఉన్న బ్యాగును, బైక్ తాళం చెవిని బలవంతంగా లాక్కొని అక్కడి నుంచి పరారయ్యారు. ఖైరతాబాద్ జోన్ డీసీపీ శిల్పవల్లి ఘటన జరిగిన కోఠి ఎస్బీఐ ఏటీఎం ప్రాంతాన్ని సందర్శించారు. నిందితులను పట్టుకునేందుకు పది ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి.
కాగా, నిందితులు చప్పల్‌బజార్‌లో దొంగిలించిన ద్విచక్రవాహనాన్ని వదిలి.. ఆటోలో కాచిగూడ రైల్వేస్టేషన్‌కు వెళ్లారు. స్టేషన్లోనే తమ దుస్తులను మార్చుకున్నట్లు పోలీసులు సీసీటీవీ ఫుటేజీలను సేకరించారు. ఢిల్లీ వెళ్లేందుకు సంపర్క్ ఎక్స్‌ప్రెస్ రైలు ఎక్కినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కాలికి బుల్లెట్ గాయమైన రిన్షాద్‌ను సుల్తాన్‌బజార్ ఏసీపీ మైనం మట్టయ్య, ఇన్స్పెక్టర్ నరసింహాలు ఉస్మానియా దవాఖానలో వైద్య చికిత్సలు చేయించారు. నిందితుల కోసం గాలింపు చేపట్టిన పోలీసులు..వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Maganur | షార్ట్ సర్య్కూట్‌తో ఇళ్లు దగ్ధం..పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే
Chennai Metro | చెన్నైలో మెట్రో నూతన మార్గం ప్రారంభం.. ప్రధాని మోదీ, సీఎం విజయ్ తొలి ప్రయాణం..!
Violence In Manipur | మణిపూర్‌లో కొనసాగుతున్న హింస.. ఐదుగురు మృతి, పలు ఇళ్లకు నిప్పు
Delhi Police | పోలీసులపై దాడులు, అడ్డగింత.. సీజేపీ నిరసనలో 20 ఎఫ్ఐఆర్లు నమోదు
Hanumanthu Naidu | కొత్త జిల్లాల ఏర్పాటుతో విరజిమ్మిన ప్రగతి వెలుగులు : బీఆర్ఎస్ నాయకుడు హనుమంతు నాయుడు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

