Heart Stroke | మెహిదీపట్నం, ఫిబ్రవరి 20 : గుండెపోటుతో కుప్పకూలిన ఓ కానిస్టేబుల్‌కు మరో కానిస్టేబుల్ ప్రాణం పోశాడు. తోటి కానిస్టేబుల్‌కు సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడాడు కానిస్టేబుల్.
వివరాల్లోకి వెళ్తే.. లంగర్‌హౌస్ పోలీసు స్టేషన్‌కు చెందిన కానిస్టేబుల్ సంతోష్.. గురువారం ఉదయం 7 గంటల సమయంలో విధులకు వెళ్తూ ఫ్లోర్ మిల్ వద్ద ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. అప్రమత్తమైన స్థానికులు లంగర్‌హౌస్ పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న కానిస్టేబుల్ నరేశ్.. సంతోష్‌కు సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడాడు. స్పృహలోకి వచ్చిన కానిస్టేబుల్ సంతోష్‌ను చికిత్స నిమిత్తం ఓ ప్రయివేటు ఆస్పత్రికి తరలించారు. సమయానికి సీపీఆర్ చేయడంతో ప్రాణపాయం తప్పిందని డాక్టర్లు కానిస్టేబుల్ నరేశ్‌ను అభినందించారు.